Lokesh funny speech : అదేంది చినబాబు ఇలా మాట్లాడేసారు…!

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేసే కొన్ని వ్యాఖ్యలు కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే లోకేశ్ మాట్లాడే తీరుపై సోషల్ మీడియాలో చాలామంది సైటైర్లు వేస్తుంటారు. కాలు జారినా ఫర్వాలేదు కాని నోరు జారొద్దన్న సామేత ఇప్పుడు నారా లోకేశ్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు లింక్ పెట్టొచ్చు. ఇలా లింక్ పెట్టడం చాలామంది లోకేష్ ఫ్యాన్స్ హార్ట్ కావొచ్చు. ఎందుకంటే…విపక్షపార్టీలో కీలక పదవిలో ఉన్న లోకేశ్ వంటి నాయకులు జనం మధ్యకు వచ్చిన మాట్లాడాలంటే…వారి నోట నుంచి వచ్చే ప్రతి మాటకు అర్థం ఉండాలి. ఆ మాటలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అయితే లోకేష్ మాట్లాడే మాటలకు టీడీపీకి ప్లస్ కాకపోయినా పర్లేదు…కానీ నష్టం వాటిల్లితేనే పెద్ద మైనస్.
అయితే ఇక్కడ లోకేశ్ బ్యాడ్ లక్ ఏంటంటే…లోకేశ్ మైకు పట్టుకుని…గొంతు సవరించుకుంటే…తెలుగుదేశం తమ్ముళ్ల గుండెలు టెన్షన్ తో కొట్టుకుంటాయి. ఎప్పుడెలా మాట్లాడతారో…ఏం మాట్లాడతారో…ఆయన నోటి వెంట ఎలాంటి మాటలు వస్తాయో వాళ్లకు అంతుపట్టదు. ఇప్పుడు తాజాగా అలాంటి వ్యాఖ్యలే మరోసాని లోకేష్ బాబు నోటి వెంట వచ్చాయి. తిరుపతి బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ తరపున చినబాబు ప్రచారం చేశారు.
ప్రచారంలో భాగంగా చినబాబుకు మాట్లాడేందుకు టాపిక్ లేనట్లుగా వ్యవహరించిన తీరు టీడీపీ తమ్ముళ్లకు షాక్ వచ్చినట్లంత పనైంది. వరదయ్యపాళెంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న జనాన్ని పక్కన పెడితే…చినబాబు ప్రసంగంలో పెట్రోల్, డీజీల్ ధరల గురించి ప్రస్తావించారు. తెలుగుదేశం అభ్యర్థి ఉపఎన్నికలో గెలిస్తే….గ్యాస్, పెట్రోలు ధరలు తగ్గుతాయన్న లోకేశ్ మాటలు ఇప్పుడు కడుపుబ్బా నవ్వుకునేలా చేశాయి.
తిరుపతి ఉపఎన్నికకు పెట్రోల, గ్యాస్ ధరలకు లింకేంటి చినబాబు అంటూ…జనం ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ విజయం సాధిస్తే…పెట్రోల్, గ్యాస్ ధరలు ఎలా తగ్గిస్తారు అనే సందేహాలు కలుగుతున్నాయట. తన వ్యాఖ్యలతో చినబాబు పార్టీకి నష్టం వాల్లిందంటూ తెలుగుతమ్ముళ్ల నోట వినిపిస్తోంది.