మమత కోసం ఉత్తరాఖండ్ సీఎం బలిపశువు అయ్యారా…దీదీకి నవంబర్ గండం..

మమత కోసం ఉత్తరాఖండ్ సీఎం బలిపశువు అయ్యారా…దీదీకి నవంబర్ గండం..

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సీఎం పదవి మెడపై కత్తి వేలాడుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ రావత్ రాజీనామా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు మమతా దీదీ సీఎం పదవి ఊడగొట్టాలనే బీజేపీ కేంద్ర పెద్దల పంతం తీరథ్ సీఎం పదవికి ఎసరు తెచ్చి పెట్టింది. నిజానికి ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ రావత్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండానే సీఎం పదవి అధిరోహించారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో రాష్ట్రంలో ఉభయ సభల్లో ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కావాల్సి ఉంది. అయితే ఇక్కడ విచిత్రంగా ఎన్నికల కమిషన్ తీరథ్ పోటీ చేయాలనుకున్న మహువా అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరిపేందుకు ససేమిరా అంది.

అయితే తీరథ్ రావత్ సెప్టెంబర్ 5 లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. అటు ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక నిర్వహించలేదు. దీంతో గత్యంతరం లేక తీరథ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఇదంతా కేంద్రంలోని పెద్దల కుట్రలో తీరథ్ బలిపశువు అయ్యాడని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అటు పశ్చిమబెంగాల్ లో సైతం దీదీ నందిగ్రామ్ సీటులో ఓడినప్పటికీ సీఎం పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఆమె కూడా రానున్న 6 నెలల్లోగా ఏదో ఒక నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉంటుంది. ఆమెకు సైతం నవంబర్ 5 డెడ్ లైన్ గా ఉంది. ఈ లోగా ఉప ఎన్నికలు నిర్వహించకపోతే దీదీ పదవి కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఎమ్మెల్సీగా నిలవాలనుకున్నా పశ్చిమబెంగాల్ లో శాసన మండలి లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది.

పశ్చిమ బెంగాల్ లో 1969లోనే శాసనమండలి రద్దు చేశారు. దీంతో అక్కడ కేవలం శాసన సభ మాత్రమే మిగిలింది. దీంతో ఇఫ్పుడు మమతకు ఎమ్మెల్సీగా అయినా ఎంపిక కావడం ఇబ్బందిగా మారింది. అయితే తృణమూల్ ప్రభుత్వం ఒకవేళ శాసన మండలిని పునరుద్ధరించాల్సి ఉన్నా, దానికి సంబంధించిన నిబంధనల దృష్ట్యా రానున్న రెండు మూడు నెలల్లో దాన్ని పునరుద్ధరించడం దాదాపు అసాధ్యం. రాష్ట్ర శాసన సభ మండలి ఏర్పాటుకు బిల్లు పాస్ చేసినా, కేంద్రం దగ్గర లేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

దీంతో మమతా దీదీ నవంబర్ తర్వాత పదవిలో ఉంటారో, లేక తన అనుయాయుడికి సీటు ఇచ్చి పక్కకు తప్పుకుంటారో తేలాల్సి ఉంది. అటు ఉత్తరాఖండ్ లో 2022 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ లోగా ఉప ఎన్నికలు నిర్వహించి సీఎం తీరథ్ ను కొనసాగించవచ్చు. కానీ కేవలం మమత కోసమే తీరథ్ ను బలిపశువు అయ్యాడని ప్రచారం జోరందుకుంది. మరోవైపు ప్రధానిమోదీ బెంగాల్ ఓటమిని చాలా పర్సనల్ గా తీసుకున్నారని, ఆయన ఈగో హర్ట్ అయ్యిందని, గతంలో తన ఈగో హర్ట్ చేసిన అద్వానీ, మురళీ మనోహర్ జోషీ లాంటి వారినే చరిత్ర పేజీల్లో మోదీ కప్పెట్టేశారని, అలాంటది తనను ఓ ఆడది చాలెంజ్ చేస్తే మోడీ అస్సలు సహించలేరని, ఢిల్లీలోని ఓ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d