చంద్రబాబుకు షాకిచ్చిన కుప్పం: మళ్లీ అవే నినాదాలు..!

చేసిన కర్మ ఊరికే పోదంటుంటారు పెద్దలు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అలాగే మారింది. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి టీడీపీని కైవసం చేసుకున్న చంద్రబాబు వ్యవహారం ఇన్నాళ్లూ సాఫీగానే సాగింది. అయితే గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి చేతులో ఘోరపరాజయం పొందారు. అప్పటి నుంచి చంద్రబాబుకు కష్టాలు మొదలయ్యాయి. ఇక తెలుగుదేశంపార్టీ ఖతం అయ్యిందని..చంద్రబాబుకు వయస్సు మీదపడిందని..లోకేష్ బాబుతో పార్టీని నడపడం కాదని తెలుగు తమ్ముళ్లు సామాజిక మీడియాలో బయటా చెప్పుకొచ్చారు. తెలుగుదేశంపార్టీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ బాబు ముందే జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేసి ఒక్కంత షాకిచ్చారు. చంద్రబాబుకే ఇన్నాళ్లు జైకొట్టిన కుప్పం జనం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ జెండాలు కట్టడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ..కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హల్ చల్ చేశారు. దీంతో చంద్రబాబు ఇరుకునపడ్డారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని మంకలదొడ్డి పంచాయతీ ములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 40 అడుగు ఎత్తులో భారీ జెండాను ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారీ ఫ్లెక్సీలతోపాటు హడావుడు చేశారు. కుప్పంలో ఈ ఫ్లెక్సీలు ఆసక్తిగా రేపాయి. టీడీపీలో చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం పోయిందని దీన్ని బట్టీ అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు.
ఇక కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ కు జైకొట్టడం ఇదే తొలిసారి. అప్పట్లో చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆయన ప్రసంగిస్తుండగానే అక్కడున్న జనం, కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ నినాదాలు చేశారు. బాబునే ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ ప్రశ్నించారు. చంద్రబాబు దానికి ఏదో సర్దిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా మరోచోట కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఇవన్నీ గమనిస్తూనే బాబు తన పర్యటనను కొసాగించారు. దీనిపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు బాబు. మరి రానున్నరోజుల్లో టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలన్న డిమాండ్ భారీగా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. మరి దీనికి బాబు, లోకేష్ లు అడ్డుకట్ట వేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.