Eetala suspended : ఈటెలపై వేటు…కేబినెట్ నుంచి ఔట్…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూకబ్జా చేశారని ఆరోపణలు వెల్లువెత్తడంతో మంత్రి ఈటల రాజేందర్ పై విచారణ వేగవంతం చేశారు. భూకబ్జా ఆరోపణలు నిరూపితమయ్యాయని నిర్దారణకు వచ్చిన సీఎం కేసీఆర్…ఈటలను కెబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. ఈటెల దగ్గర ఉన్న ఆరోగ్య శాఖను శనివారం లాగేసుకోగా…ఈ మరుసటిరోజే మంత్రి వర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయడం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
ఇవి కూడా చదవండి: ఒడిషాలో 14 రోజుల లాక్‌డౌన్.. కరోనా కట్టడికి పట్నాయక్ సర్కారు కీలక నిర్ణయం!
మంత్రిపదవి నుంచి ఈటెలను తొలగిస్తూ సీఎం కార్యాలయం ఆదివారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు లేఖ పంపారు. లేఖ అందిన వెంటనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈటలను కెబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు రాజ్ భవన్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈటెల రాజేందర్ ఇప్పుడు మాజీ మంత్రి అయ్యారు. కలెక్టర్ రిపోర్టులో కబ్జాలకు పాల్పడింది వాస్తవమేనని తేలడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.