Eetela Dinner: ఈటల విందు…అసలు రాజకీయం షురూ..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ జోరు పెంచారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫర్ చేశాక..మరింత స్పీడ్ మీదున్నారు. విందు రాజకీయాలతో బిజీగా మారారు. అధికార టీఆరెస్ ను గట్టిగా ఎదుర్కోనెలా విందు రాజకీయాలకు తెరతీశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈనెల 14న బీజేపీ కండువా కప్పుకోవడానికి డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే టీఆరెస్ కు రాజీనామా కూడా చేశారు. ఇక ఎమ్మెల్యే పదవికీ కూడా చేస్తానని చెప్పారు.
ఇక బీజేపీ తీర్థం పుచ్చుకునే ముందు ఈటల విందు రాజకీయం షురూ చేశారు. శామీర్ పేటలోని తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ లక్ష్మణ్, డీకె అరుణ, రఘునందర్ రావు, రాజాసింగ్ , ఎంపీ సోయం బాపూరావు, గడ్డం వివేక్ తదితరులను విందుకు ఆహ్వానించారు.
ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉపఎన్నికకు బీజేపీ బలోపేతంపై ప్రధానం ఈ విందులో చర్చకు వచ్చినట్లు సమాచారం. టీఆరెస్ అభ్యర్థిగా ఎవరు ఉంటారన్న దానిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
దుబ్బాక ఫలితాలనే హుజురాబాద్ తోనూ తీసుకురావాలని బీజేపీ నేతలు గట్టిగా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీలో ఈటలకు పెద్దపీట వేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం హాజరు కాలేదు. సంజయ్ సమీప వ్యక్తులు కోవిడ్ బారిన పడటంతో హోం క్వారంటైన్ లో ఉండటంతో రాలేకపోయారు.