మోడీపై పీకే మాస్టార్ ప్లాన్…ప్రెసిడెంట్ ఎలక్షన్ రూపంలో కొత్త చిక్కులు..

వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయా…ప్రతిపక్షాలకు ఏకం చేస్తూ పావులు కదుపుతున్నారా…ప్రస్తుతం అదే ఎత్తుగడతో ప్రాంతీయ పార్టీలు ఏకం అవుతున్నాయా. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈమధ్య కాలంలో ప్రశాంత్ కీషోర్ పలు కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. శరదపవార్ , ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశం అయ్యారు. శరద్ పవార్ తో పలుసార్లు చర్చలు జరిపారు. సమావేశాలకు సంబంధించి పూర్తి సమాచారం బయటకు పొక్కనప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా శరద్ పవార్ రాష్ట్రపతి అభ్యర్థిగా బలమైన కూటమి ఏర్పాటకు సంబంధించి ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వరుస భేటీలో రాజకీయ వర్గాల్లో సంచలనం కానుంది. ప్రస్తుతం పీకే ఏకంగా శరద్ పవార్ ను రాష్ట్రపతిగా ఎన్నికలయ్యేలా చేసేందుకు లాబీయింగ్ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఇప్పటికిప్పుడు చేసినవి కావు…బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తూ వాటిని గెలిపించినట్లయితే…మోదీపై ప్రతీకారానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత పీకే మూడు సార్లు శరద్ పవార్ తో భేటీ అయ్యారు. శరద్ పవార్ ను న్యూఢిల్లీ నివాసంలో జరిగిన ఈ భేటీలో కొంతమంది ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. అయితే మోదీకి వ్యతిరేకంగానే ఈ సమావేశం జరిగినట్లు నమ్ముతున్నారు.
ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో పీకే సమావేశం…బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే జరిగిందంటున్నారు. ప్రతిపక్ష రాజకీయ పోరాటానికి కొత్త కోణాన్ని ఈ భేటీ జోడించిందంటున్నారు. ఇది వచ్చే ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల చుట్టూ కేంద్రీక్రుతమైనట్లు భావిస్తున్నారు. ఇక పీకే వస్తున్న లెక్కల ప్రకారం…ఒక్క ఒడిషా సీఎం బిజు జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటిమికి ఓటేసినట్లయితే..ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధి ఓటమిపాలవుతారని భావిస్తున్నారు. ప్రతిపక్షపాలిత మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఎంతో కీలకం. దీనికోసమే నవీన్ పట్నాయక్ ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను పీకే కలిసి చర్చలు జరిపారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, జగన్ మోహన్ రెడ్డి, అరవింత్ కేజ్రివాల్, స్టాలిన్ , ఉద్దవ్ ఠాక్రేలతో ప్రశాంత్ కిషోర్ కు మంచి సంబంధాలున్నాయి. వారి గెలుపునకు ప్రశాంత్ కిషోర్ మార్గదర్శకాలు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా అందులో కలిపేస్తే…రాష్ట్రపతి ఎలక్షన్స్ ల బీజేపీని ఓడించడం సులభం అవుతుందంటున్నారు. ఇక ప్రియాంక గాంధీ పీకే దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. పీకే తన ప్రణాళికల గురించి కాంగ్రెస్ అధిష్టానికి వివరించారని…పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఉణ్న అవకాశాలు కూడా వివరించినట్లు చెబుతున్నారు. 2024లో జరిగే లోకసభ ఎన్నికలకు ముందు దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కేలా ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించాలన్న పీకే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సిందే.