కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా..!

కర్నాటక సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవి నుంచి యడ్యూరప్పను తొలగిస్తున్నారన్న ప్రచారం కొన్ని రోజులుగా సాగుతున్న విషయం తెలిసిందే. అందరూ ఉహించినట్లుగానే గత కొన్ని రోజులు నుంచి వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఇవాళ యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర హైకమాండ్ సూచన మేరకే ఆయన రాజీనామా చేసినట్లు చర్చ జరుగుతోంది. సీఎంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన్ను రాజీనామా చేయాలని బీజేపీ అధిష్టానం కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజే ఆయన రాజీనామా చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు యడ్యూరప్పకు గవర్నర్ కు తన రాజీనామా లేఖను అందించనున్నారు.
ఈ నేపథ్యంలో తన సర్కార్ రెండేళ్ల పాలనపై బెంగళూరులో ఈరోజు జరిగిన సమావేశంలో యడ్యూరప్ప మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉండమని తనను అడిగారని…కానీ తాను కర్నాటకలో ఉంటానని ఆయనకు చెప్పానని చెప్పారు. ఆ తర్వాత కర్నాటకలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటూ వచ్చిందన్నారు. తనకు ఎప్పుడూ అగ్ని పరీక్షేఎదురవుతుంటుందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రెండు సంవత్సరాలు కరోనాతోనే సరిపోయిందన్నారు. తన రెండేళ్ల పాలనపై యడ్యూరప్ప మాట్లాడుతున్నా కన్నీళ్లు పెట్టారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఆయన ఏ ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని ఆయన పూర్తి చేయలేరు. ఈ సాయంత్రమే బీజేపీ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయనుంది.