Chandrababu fire on Jagan: ఏపీలో రాజుకున్న కుప్పం సెగ

Chandrababu fire on Jagan: ఏపీలో రాజుకున్న కుప్పం సెగ

రోడ్ షోలు, సభలకు అనుమతి లేదని జగన్ సర్కారు ప్రకటించిన తర్వాత చంద్రబాబు కుప్పం టూర్ హాట్ టాపిక్ గా మారింది. కొత్త జీవో నేపథ్యంలో బాబు వస్తారో లేదోనని అనుకుంటుండగానే… ఆయన రానే వచ్చారు. కానీ వచ్చీ రాగానే చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులను కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. రోడ్ షోకు గానీ, సభకు గానీ అనుమతి లేదని బాబుతో పోలీసులు చెప్పారు. జీవో 1 ప్రకారం ఆంక్షల గురించి వివరించారు. దీంతో తన సొంత నియోజకవర్గంలో ఏంటి ఈ ఆంక్షలంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. అంతేకాదు పోలీసుల నోటీసులను తీసుకోవడానికి బాబు నిరాకరించారు.

పోలీసులతో చంద్రబాబు వాగ్వాదం
పోలీసులతో చంద్రబాబు తీవ్ర వాగ్వాదానికి దిగారు. కుప్పంలో తాను ఏడుసార్లు గెలిచానని తేల్చిచెప్పారు. తన పర్యటనపై డీజీపీకి కూడా సమాచారం ఇచ్చానంటూ చెప్పుకొచ్చారు. కుప్పం రావొద్దని చెప్పడానికి మీరెవరంటూ పోలీసులపై బాబు మండిపడ్డారు. తాను అనుకుంటే గతంలో జగన్ పాదయాత్ర చేసేవారా అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ కు రోజులు దగ్గర పడ్డాయంటూ విమర్శించారు. చీకటి జీవోలతో తనను ఏం చేయలేంటూ గట్టిగానే రియాక్ట్ అయ్యారు చంద్రబాబు. సైకో సీఎం అంటూ జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హాట్ డైలాగులతో కుప్పంలో హీట్ పుట్టించారు. కొన్నిరోజులుగా సైలెంట్ గా ఉన్న కుప్పంలో ఒక్కసారిగా ఈ పరిణామాలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.

రోడ్ షో బదులు బాబు పాదయాత్ర
చంద్రబాబు నుంచి ఎంత ప్రతిఘటన ఎదురైనా చివరకు జరగాల్సిందే జరిగింది. రోడ్ షోకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో బాబు ఎట్టకేలకు పాదయాత్రగా బయలుదేరారు. పెద్దూరు నుంచి బాబు పాదయాత్ర మొదలైంది. ప్రభుత్వ తీరును ఎండగడుతూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. మొత్తంగా చంద్రబాబు సభ గానీ, రోడ్ షోగానీ చేయకుండా అడ్డుకోవడంలో జగన్ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు.

పంతం నెగ్గించుకున్న జగన్ సర్కార్
చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసినా ఏపీ సర్కారు మాత్రం పంతం నెగ్గించుకుంది. బాబును సొంత నియోజకవర్గంలో ఆయనకు బ్రేకులు వేసింది. అంతమాత్రాన చంద్రబాబుపై జగన్ సర్కారు విజయం సాధించింది అని అనుకోవడం పొరపాటే. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కచ్చితంగా బాబు ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో టీడీపీ నేతలు వైసీపీకి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. అయితే జగన్ సర్కార్ మాత్రం ప్రస్తుతం దూకుడుగా వెళ్తోంది. టీడీపీ నుంచి, ఇటు వైసీపీ నుంచి విమర్శలు- ప్రతి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ఎవరికి అనుకూలంగా మారుతాయన్నది ఇప్పుడైతే చెప్పలేం. రెండువర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ పరిణామాన్నీ అనుకూలంగా మల్చుకోవడానికి టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఒక్కటి మాత్రం వాస్తవం. కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గం. ఇక్కడ చంద్రబాబుపై వైసీపీ పైచేయి సాధించినా, సాధించకపోయినా జగన్ పార్టీకి ఒరిగేదేమీ లేదు. ఈ పరిణామాలతో వైసీపీకి పోయేదేమీ లేదు. కానీ ఈ పరిణామాలను బాబు కచ్చితంగా తనకు అనుకూలంగా మల్చుకోవాలి. లేనిపక్షంలో డ్యామేజ్ అనేది టీడీపీకే ఎక్కువ. దాన్ని గ్రహించారు కాబట్టే చంద్రబాబు కూడా దూకుడు పెంచారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కుప్పం ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ప్రజల రియాక్షన్ ఓట్ల రూపంలోనే తెలుస్తుంది. ఎలక్షన్ నాటికి ఈ వేడి ఇలాగే ఉంటుందా అన్నది చెప్పలేం. అప్పటి వరకు ఎలాంటి పరిణామాలైనా జరగవచ్చు. మరి కుప్పంలో చంద్రబాబు మరోసారి టీడీపీ జెండా పాతుతారా.. లేక కుప్పంలో ఫ్యాన్ గాలి వీస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d bloggers like this: