టీడీపీలో నారా లోకేష్ కు నిద్ర పట్టకుండా చేస్తున్న…సొంత పార్టీ కార్యకర్తలు…ఎందుకంటే…
ఏపీలో టీడీపీ పార్టీ రాజకీయాలు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా అధినేత చంద్రబాబు తర్వాత పార్టీని అన్ని రకాలుగా ఆదుకునే నాథుడు లేకుండా పోయాడు. అటు యువనేత నారా లోకేష్ మంగళగిరిలో ఓటమి తర్వాత పార్టీ భవిష్యత్తు నేతగా ఒప్పుకునేందుకు అటు టీడీపీలో ఓ వర్గం సిద్ధంగా లేదనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఓ వర్గం బలంగా నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తోన్నాయి. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో లోకేష్ తెరవెనుక ఉండి చక్రం తిప్పారని అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిందని, అతడి అనుకూల వర్గం వాదిస్తుంది. కానీ 2018లో లోకేష్ పార్టీని ముందుండి నడిపించడం కాదుకదా, స్వయంగా తానే ఓడిపోయే పరిస్థితి తెచ్చుకోవడం, తెలుగదేశం మనుగడకే సవాలుగా మారింది. దీంతో నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ కు పగ్గాలు ఇవ్వాలని కిందిస్థాయి కేడర్ నుంచి డిమాండ్ జూనియర్ పైనే దృష్ఠి పెడుతుంది. ఎందుకు ఆయనే రావాలి అని డిమాండ్లు వినిపిస్తోన్నాయన్నదే ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘార పరాజయం తరువాత పార్టీలో కేడర్ డీలా పడిపోయారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత స్పీడ్ చూసి చాలా మంది టీడీపీ కంటే బిజేపీనే సేఫ్ అంటూ ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు.
కొందరు పార్టీకి దూరంగా ఉంటూ సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పంచాయితీ ఎన్నికల ఫలితాలు చంద్రబాబుతోపాటు పార్టీ కేడర్ ను కుదేలు చేశాయి. చంద్రబాబు సొంత నియోకవర్గం కుప్పంలో వచ్చిన ఫలితాలు చంద్రబాబును కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నాయి. కుప్పంలో ఏకంగా చంద్రబాబు ముందే కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని తెలుగు తమ్ముళ్లు గోల చేయడం ఇప్పుడు పార్టీలో కీలక అంశంగా మారింది. అసలు పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందనే చర్చ సీనియర్ నేతల మధ్య జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2009 ఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారానికి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పటికి ఆయన ప్రసంగాలు మాత్రం ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. భవిష్యత్తులో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే దిక్కు అవుతారని టీడీపీ కేడర్ భావిస్తున్నారు. తన స్నేహితుడు కోడాలి నాని వైసీపీలో చెరినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీకి మధ్య ఉన్న విబేధాలు భగ్గుమన్నాయి. టీడిపి పునాదులు కదుతున్నపుడల్లా జూనియర్ ఎన్టీఆర్ మాట వినిపించడం లోకేష్ వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం.
అటు నందమూరి కుటుంబం నుంచి నందమూరి బాలకృష్ణ స్వయంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రాకతోనే తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని నమ్ముతున్నారు. దానికి తగ్గట్టే లోకేష్ పూర్ పెర్ఫార్మన్స్ కూడా కలవర పరుస్తోంది. అయితే వరుస సినిమాల్లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో రావడం దాదాపు అసాధ్యమే అని సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి.