100 పడకలతో ఉచిత డయాలసిస్ కేంద్రం…పేదలకు ఉచిత వైద్యం, వసతి… ఎక్కడంటే..
ప్రస్తుత కాలంలో వైద్యం మొత్తం కార్పోరేట్ అయిపోతున్న ఈ తరుణంలో పేద ప్రజలకు, నాణ్యమైన ఆధునిక వైద్యం దూరం అవోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (డిఎస్‌జిఎంసి) దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఒక ఆసుపత్రిని ప్రారంభించింది. ఇందులో 100 మంది రోగులకు ఒకేసారి డయాలసిస్ చేసే వీలుగా డయాలసిస్ బ్లాకును ప్రారంభించారు. ఇలాంటి సౌకర్యం కలిగిన ఏకైక ఆసుపత్రి దేశంలో ఇదొక్కటే కావడం విశేషం. ఈ ఆసుపత్రిలో మొదటి దశలో సుమారు 100 డయాలసిస్ సౌకర్యం ఉన్న పడకలు ఏర్పాటు చేశారు. డయాలసిస్ బ్లాక్‌కు బాబా హర్బన్స్ సింగ్ అనే కార్ సర్వీస్‌మెన్ పేరు పెట్టారు. దేశంలో ఇంతకంటే పెద్ద డయాలసిస్ బ్లాక్ ఎక్కడా లేదని గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ పేర్కొంది. 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పేదలు ఎప్పుడైనా వచ్చి వారి చికిత్స పొందవచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన ఆసుపత్రి. బిల్లింగ్ కౌంటర్ లేని ఏకైక ఆసుపత్రి ఇదే కావడం విశేషం. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన యంత్రాలను ఇందులో ఏర్పాటు చేశారు. రాబోయే కాలంలో బాలా సాహిబ్‌లో నిర్మిస్తున్న ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి సదుపాయం కూడా కల్పిస్తామని గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ మంజిందర్ సింగ్ సిర్సా చెప్పారు. ఆసుపత్రిలో ఒక టీవీ యూనిట్ కూడా ఏర్పాటు చేయబడింది. సారాయ్ కాలే ఖాన్ సమీపంలో నిర్మిస్తున్న చారిత్రాత్మక గురుద్వారా బాలా సాహిబ్‌లోని ‘గురు హర్కిషన్ హాస్పిటల్’ రాబోయే కాలంలో అత్యాధునిక సౌకర్యాలతో అమర్చబడుతుందని గురుద్వారా కమిటీ పేర్కొంది.
రోగులు చికిత్స కోసం రావడం ప్రారంభించారు
మొదటి రోజునే డయాలసిస్ కోసం చేరుకున్న మనోజ్ (45) అనే వ్యక్తి యూపీలోని కర్రీ గ్రామం నుంచి వచ్చానని చెప్పాడు. అనారోగ్యం కారణంగా, మూడేళ్ళుగా డయాలసిస్ చేయించుకుంటున్నానని, అయితే ప్రతి నెల మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుందని, అయితే కార్పోరేట్ ఆసుపత్రిలో ప్రతిసారీ 4 వేలు ఖర్చు అవుతోందని పేర్కొన్నారు. చికిత్స, మందులు ఉచితం అని పేర్కొన్నారు. . 55 ఏళ్ల ఓంప్రకాష్ తాను భజన్‌పురా నుంచి వచ్చానని చెప్పాడు. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉందని. కానీ ఇక్కడ నుండి గొప్ప ఉపశమనం పొందినట్లు తెలిపారు.
చికిత్స కోసం రిజిస్టర్ చేసుకోవాలి…
ఈ చికిత్స కోసం ఢిల్లీ గురుద్వారా ప్రభంధక్ కమిటీ వెబ్ సైట్ లోకి వెళ్లి ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది.
రోజుకు ఎంతమందికి చికిత్స చేస్తారు..
రోజుకు 500 మందికి పైగా ఇక్కడకు చికిత్స కోసం వస్తారు. అన్ని రాష్ట్రాలకు చెందిన వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషం. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన డాక్టర్లు సైతం అందుబాటులో ఉన్నారు.
తెలంగాణ, ఏపీ ప్రజల కోసం…