Opinion : వైసీపీ ప్రజల పట్టానా పేద పార్టీ అయితే….టీడీపీ “ధనం” పార్టీ


ప్రజల ఆస్తుల సంగతేమో కానీ పార్టీల ఆస్తులు మాత్రం కోట్లు కోట్లు పేరుకు పోతున్నాయి. తాజాగా “ది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్” సంస్థ దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల ఆస్తుల వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మూడు పార్టీలు వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్‌లు టాప్-10 ధనిక ప్రాంతీయ పార్టీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం టీడీపీ రూ.193 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలవగా టీఆర్ఎస్ పార్టీ రూ.188 కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూ.93 కోట్లతో ఎనిమిదో స్థానం‌లో నిలిచింది. ఇదిలా ఉంటే టీడీపీ ఆస్తుల విలువలో రూ. 115 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండగా, టీఆర్‌ఎస్ ఆస్తుల విలువలో రూ. 152 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇక ఇతర ఆస్తుల కేటగిరిలో రూ.79 కోట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగంలో నిలిచింది.
ఇక దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా సమాజ్‌వాదీ పార్టీ నిలిచింది. ఆ పార్టీ ఆస్తుల విలువ రూ. 572 కోట్లు ఉన్నట్టు తెలిపింది. ఇక బీజేడీ రూ.232 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, అన్నా డీఎంకే రూ.206 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. అంతేకాదు వీరి విరాళాలను ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సేకరించినట్లు పేర్కొంది. అంతేకాదు పార్టీల విరాళాలు వాటి లెక్కలను ప్రతీ ఏడాది ఎన్నికల కమిషన్ కు సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు దేశంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. వాటి స్థిర చరాస్తుల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ గతంలో పలు సంచలనాత్మక విషయాలను బయటపెట్టింది. అందులో ఏడీఆర్ సంస్థ నివేదిక ప్రకారం చంద్రబాబుకు 134 కోట్ల 80 లక్షల 11 వేల 728 రూపాయల చరాస్థులు, 42 కోట్ల 68 లక్షల 83 వేల 883 రూపాయల స్థిరాస్తులున్నాయని తెలిపి గతంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
అలాగే ఏడీఆర్ ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఎన్నికల్లో నేరచరితుల్ని నివారించాలనే లక్ష్యంతో పని చేస్తోన్న స్వచ్ఛంద సంస్థ, పోల్ రైట్స్ గ్రూప్ ”అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)” తాజా నివేదికను విడుదల చేసింది. ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలోని వివరాల ప్రకారం ఏడీఆర్ నివేదికలను రూపొందిస్తుంది.

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d bloggers like this: