Opinion: వినదగు రాహుల్ చెప్పినా…మోదీ గారు వింటున్నారా..

Opinion: వినదగు రాహుల్ చెప్పినా…మోదీ గారు వింటున్నారా..

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కరోనా బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులే కాదు మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. స్వాత్రంత్యం వచ్చిన తర్వాత ఏనాడూ చూడని విపత్తు కరోనా రూపంలో ఇప్పుడు వచ్చింది. ఈ సయమంలోనే రాజకీయనేతలు…రాజకీయాలు వదిలి కలిసి కట్టుగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు రాజకీయాలను వదిలి కలిసికట్టుగా పనిచేయకపోతే మన తరాలు మర్చిపోలేని బాధలను పొందాల్సి ఉంటుంది. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే కరోనా ఉధృతికి కారణమంటున్నారు విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి:  ప్రపంచానికి వ్యాక్సిన్ ఎక్స్ పోర్ట్ చేసే భారత్ లో టీకా కొరత ఉందా? ఇది ఎంత వరకు నిజం!

దేశం సంకట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంతా ఏకతాటిపైకి రావడం అవసరం. సరిగ్గా ఇలాంటి సందర్భమే మనం దేశ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో చూశాం. అప్పటి తొలి కేంద్ర కేబినేట్ బృందంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన శ్యామప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్, బలదేవ్ సింగ్ వంటి నేతలకు నెహ్రూ చోటు కల్పించారు. తొలికేంద్ర మంత్రి వర్గంలో ఉన్న శ్యాంప్రసాద్ ముఖర్జీకి చాలా అంశాల్లో ప్రధానమంత్రి నెహ్రుతో విభేదాలు ఉండేవి. దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో పెద్దెత్తున హిందువుల నిర్మూలన సాగింది. అక్కడి నుంచి 20లక్షల మంది భారతదేశానికి వలస వచ్చారు. పాకిస్థాన్ తో కఠినంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించడంలో నెహ్రు చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.

పాక్ ప్రధానితో చర్చలు జరపడాన్ని నెహ్రుతో శ్యాంప్రసాద్ ముఖర్జీ విభేదించారు. కెబినెట్ సమావేశంలో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ, ప్రతిపక్షాల్లోని నేతల్లో సైతం మంచి సమర్థత ఉన్నవారి సలహాలను తీసుకునే సంప్రదాయం మన దేశంలో ఉంది. అంతేకాదు రాజీవ్ గాంధీ ఐక్యరాజ్య సమితి జనరల్ సభలో భారతదేశం తరపున ప్రసంగించేందుకు ప్రతిపక్షనేత వాజ్ పేయిని తన వెంట అమెరికా తీసుకెళ్లారు. పీవీ నరసింహారావు సైతం అప్పటి జనతా పార్టీ సభ్యుడైన సుబ్రహ్మణ్య స్వామిని కేంద్ర కేబినేట్ లోకి తీసుకున్నారు. దేశం అన్నప్పుడు పార్టీలు మరిచిపోవాలి అనే సందేశం పంపారు.

తాజాగా దేశంలో గత సంవత్సరం కరోనా మహమ్మారి విలయాన్ని ముందే పసిగట్టిన ప్రతిపక్ష నేతల్లో రాహుల్ గాంధీ ఒకరు. బహుశా ఆయన స్వతంత్రంగానో, లేక ఆయన చుట్టూ ఉండే మేధోగణమో…ఈ కరోనా మహమ్మారి ప్రమాదాన్ని ముందే ఊహించి సలహాలు ఇచ్చారు. గతేడాది కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించింది. చప్పట్లు కొట్టించింది. దీపాలు వెలిగించి కరోనా వారియర్స్ కు మద్దతుగా నిలవాలని ప్రధాని పిలుపునిచ్చారు. కానీ దేశంలో కరోనా రెండ్ వేవ్ వ్యాపిస్తోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని రాహుల్ ప్రశ్నించారు. దేశంలో టీకాల ప్రక్రియను వేగవంతం చేయకుంటే పరిస్థితి చేయిదాటిపోతుందని ముందే అంచనా వేశారు. రాహుల్ ఊహించినట్లే జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: నాడు ఎన్టీఆర్, నేడు జగన్…ఆత్మగౌరవం దెబ్బతీస్తే…ఎవరికి నష్టం…!

రాజకీయాల్లో విభేదాలనేవి సర్వసాధారణం. కానీ ప్రజాజీవితంలో మాత్రం అలా కాదు. ప్రజలకు ఏం కావాలో వాటికే ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే ప్రజాగ్రహానికి గురికాకతప్పదు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తాజాగా తన అత్యున్నత సమావేశానికి, ప్రతి పక్ష నేతను తన పక్కనే కూర్చోబెట్టుకొని అధికారులకు ఆదేశాలను ఇమ్మని, వీలైతే సలహాలు ఇమ్మని ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గతంలో ప్రభుత్వాలను నడిపించినవారికి అనుభవం ఉండి ఉండొచ్చు. కానీ వారి సలహాలను మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా ముందస్తు సూచనలను పాటించాల్సిన అవసరం మోదీ కేబినెట్ కు లేకపోవచ్చు. కానీ విపత్తు సమయంలో మంచిని, జాగ్రత్తలను చెప్పే వారి సలహాలు మాత్రం ఖాతరు చేయాల్సి ఉంటుంది. ఇదే సిసలైన ప్రజస్వామ్య స్పూర్తి.

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d