Ramdev Baba: నన్ను అరెస్టు చేయడం మీతరం కాదు: రాందేవ్ బాబా

అల్లోపతి వైద్యంపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అతడి వ్యాఖ్యలపై వైద్యులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ విభాగం రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా రాందేవ్ బాబాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘నన్ను అరెస్ట్ చేయడం అతడి తండ్రి వల్ల కూడా కాదు’ అని వ్యాఖ్యానించాడు. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యల అనంతరం రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేయడం వైరల్‌గా మారింది. జూమ్ సమావేశంలో పైవిధంగా మాట్లాడారు. దుండగుడు రాందేవ్, మహాదొంగ రాందేవ్ వంటి పదాలు తనపై వస్తున్నాయని చెబుతూ నవ్వుకున్నారు. అయితే ‘నీ తండ్రి కూడా అరెస్ట్ చేయడు’ ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
One thought on “Ramdev Baba: నన్ను అరెస్టు చేయడం మీతరం కాదు: రాందేవ్ బాబా”