Covid-19: వీళ్లు ఇక మారరా…బిందెలతో కరోనాపై పోరాటం…ఎక్కడంటే..

దేశంలో కరోనా ఉగ్రరూపందాల్చుతోంది. రోజు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా…జనాలు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం, మాస్క్ ధరించడం, శానిటైజర్ ఇవే మనకు శ్రీరామరక్ష. కానీ ఎవరు పాటిస్తున్నారు…ఎన్ని ప్రచారాలు చేసినా…జనం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిలో వందల సంఖ్యలో ఆడవాళ్లు నెత్తిమీద నీళ్ల బిందెలు పెట్టుకుని..కరోనాను నాశనం చేసేందుకు పాటలు పాడుతూ….రోడ్డుమీదకు బయలుదేరారు.
ఇది కూడా చదవండి: మీ భార్యను మీకు అనుకూలంగా మార్చుకోవడం ఎలా
వీరంతా ఒకరి మీద ఒకరు పడుతున్నట్లుగా దగ్గర దగ్గరగా నిల్చున్నారు. వీరిలో చాలా మంది అసలు మాస్కే పెట్టుకోలేదు. కోవీడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇంత మంది ఇలా గుంపులు గుంపులగా చేరడం ఆందోళన కలిగిస్తోంది. అహ్మదాబాద్ నగర శివారులోని సనంద్ తాలుకా నవపురాలో ఈ ఘటన జరిగింది. బైల్యదేవ్ దేవాలయంలో జలాభిషేకం చేస్తే కరోనా అంతరించిపోతుందని వారి నమ్మకం అట. దీంతో కరోనాను నిర్మాలించాలంటూ వందలాది మహిళలు ఊరేగింపుతో బయలుదేరారు. కోవీడ్ రూల్స్ ను పక్కన పెట్టారు. ఒక్కసారిగా వందల జనం తరలిరావడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈవీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో రంగ ప్రవేశం చేశారు.
23మంది అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సర్పంచ్ తోపాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేసిట్లు చెప్పారు. ఇక నవపురా గ్రామంలో ఇప్పటివరకు 90 మంది కరోనాతో మరణించారు. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గుజరాత్ వ్యాప్తంగా కర్ఫ్యూవిధించింది ప్రభుత్వం. నైట్ కర్య్ఫూ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ ఆంక్షలను మే 12వ తారీఖు వరకు పొడగించింది గుజరాత్ సర్కార్. సూరత్, వడోదర, రాజ్ కోట్ వంటి నగరాల్లో రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్ లను మూసివేశారు.