హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం…కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది పర్యాటకులు మృతి

హిమాచల్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయలో విషాదం అలుముకుంది. కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది పర్యాటకులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మ్రుతులంతా ఢిల్లీకి చెందినవారిగా అక్కడి అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో పెద్ద బండరాళ్లు కిందకు దూసుకువచ్చాయి. బస్తేరిల లోయలో ఉన్న బ్రిడ్జిపై పడటంతో అది కూలిపోయింది. అంతేకాదు పక్కనే ఉన్న పలు కార్లపై బండరాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో చాలా కార్లు, పర్యాటకుల విశ్రాంతి గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
కొండచర్యలు విరిగిపడుతున్న ద్రుశ్యాలను కొందరు స్థానికులు వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం వచ్చినట్లుగా భారీగా బండరాళ్లు కిందకు దూసుకువచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.