2040 లో సమాజం కూలిపోతుంది… MIT పరిశోధకుల హెచ్చరిక..!

2040 లో ఏం జరగబోతోంది…! మానవ సమాజం పతనం కాబోతోందా? ఎంటీఐ పరిశోధకలు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? మానవసమాజ పతనంపై లిమిట్స్ టు గ్రోత్ పేరుతో రాసిన పుస్తకంలో ఎలాంటి ఎలాంటి హెచ్చరికలు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం…!
మానవ జీవన విధానంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. నాణ్యత తగ్గిపోుతుంది. ఆహారోత్పత్తి పారిశ్రామిక ఉత్పత్తులు భారీగా పతనం అవుతాయి. క్రమంగా మానవ జనాభా కూడా తగ్గిపోతుటుంది. మస్సాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు మానవాళి భవిష్యత్తు గురించి 1972లో వేసి అంచనాలు ఇవి. కేవలం ఒక ఆర్థిక వ్రుద్ధిపైన్నే కాదు పర్యావరణ సామాజిక మార్పులను పట్టించుకోకుండా ముందుకు సాగినట్లయితే….21వ శతాబ్దంలోనే మానవ సమాజం పతనం పక్కా అని హెచ్చరికలు జారీ చేశారు. లిమిట్స్ టు గ్రోత్ పేరుతో వాళ్లు రాసిన పుస్తకం అప్పట్లో అధిక సంఖ్యలో అమ్ముడుపోయింది.
ఇదంతా ట్రాష్ అని చాలా మంది కొట్టి పారేశారు. కానీ వారి అంచనాలు ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చేస్తే నిజమయ్యే పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రముఖ వ్రుత్తి సేవల సంస్థ కేపీఎంజీ ఇంటర్నేషనల్ కు చెందిన గయా హెర్రింగ్టన్ అనే పరిశోధకురాలు అభిప్రాయపడ్డారు. మానవులు తమ తీరును మార్చుకోకుండా ఇలాగే కొనసాగించినట్లయితే దశాబ్దకాలంలో ఆర్థికాభివ్రుద్ధి 2040నాటికి మానవ సమాజం పూర్తిగా పతనమైతుందని హెచ్చరించారు. ఎంఐటీ పరిశోధకులు 1972లో ఈ అధ్యయానాన్ని చేసినప్పుడు ప్రపంచ జనాభా జనన మరణాలు రేటతోపాటు పారిశ్రామికోత్పత్తి, ఆహార ఉత్పత్తి వైద్య విద్యా సేవలు పునరాత్పదక ఇంధనాల వినియోగం, కాలుష్యం వంటివాటిని ఆధారంగా చేసుకుని 1900 వ సంవత్సరం నుంచి 2060 దాకా మానవ సమాజ వికాసం గురించి అంచనా వేశారు.
ఇక దీనికోసం వరల్డ్ 1 అనే కంప్యూటర్ ప్రోగ్రాం ను వినియోగించారు. ఎంఐటీకి చెందిన జెర్రీఫాస్టర్ ఆ ప్రోగ్రాంను రాసారు. 1900నుంచి జనాభా ఎలా పెరిగింది…జీవన నాణ్యత 1900నుంచి 1940 దాలా ఎలా పెరిగింది అక్కడి నుంచి పెరుగుదల వేగం తగ్గి 2020కి పతాక స్థాయికి చేరింది. ఆ తర్వాత ఎలా పతనమయ్యేది ఆ ప్రోగ్రామ్ ద్వారా గ్రాఫ్ లరూపంలో చూపించారు. 1972 తర్వాత జీవన నాణ్యత ఎలా పడిపోబోయేది కూడా ఆ ప్రోగ్రం సరిగ్గా ఊహించింది.
2020ని మానవ నాగరికతకు శిఖరస్థాయిగా ఆ ప్రోగ్రాం ఊహించింది. 2020నాటికి ప్రపంచం పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. దాన్ని నివారించడానికి ఏం చేయకపోతే జీవననాణ్యత జీరోకు పడిపోతుందని 1973లో ఫాస్టర్ హెచ్చరించారు.
కాలుష్యం మనుషుల ప్రాణాలు తీయడం మొదలుపెడుతుంది. దానివల్ల జనాభా భారీగా తగ్గిపోతుంది 2040-2050నాటికి ప్రపంచ జనాభా 1900కన్నా తక్కువకు పడిపోతుంది. నాగరీక జీవనం తన మనుగడను పూర్తి కోల్పోతుందని 1973లో హెచ్చిరించారు. అప్పట్లో ఫాస్టర్ బ్రుందం ఈ అంచనాలకు వినియోగించిన నమూనానే హెర్రింగ్టన్ కూడా ఉపయోగించారు.
ఇలాంటి పరిస్థితులే కొనసాగినట్లయితే పది సంవత్సరాల్లో ఆర్ధికాభివ్రుద్ది పూర్తిగా చిన్నాభిన్నం అవుతుందని 2040నాటికి మానవ సమాజం పూర్తిగా కూలిపోతుందని హెచ్చరించారు.