ఈ నెల 7న తమిళ సీఎంగా స్టాలిన్ ప్రమాణం.. ఎన్నికల హామీలు నెరవేర్చడమే లక్ష్యమని ప్రకటన!

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకార వేడుక తేదీ ఖరారు అయ్యింది. ఈ నెల 7న తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో సాదాసీదాగా ప్రమాణం కార్యక్రమం ఉంటుందన్నారు.
తమిళనాట నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో డీఎంకే 159 సీట్లు గెలిచి.. స్పష్టమైన ఆధిక్యత చాటింది. డీఎంకేను పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో కరుణానిది వారసుడు స్టాలిన్ కీలక పాత్ర పోషించారు.
విక్టరీ సాధించిన అనంతరం తండ్రి కరుణానిధి సమాధి దగ్గర నివాళులర్పించిన స్టాలిన్.. అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ పాలన ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో స్టాలిన్ కొలత్తూరు నుంచి విజయం సాధించారు. ఆయన తనయుడు ఉధయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి గెలుపొందాడు.