జనాభా పెరుగుదల కోసం సంక్షేమ పథకాలు..ఎక్కడో తెలుసా..?

ప్రపంచం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి జనాభా విస్పోటనం. జనాభాను తగ్గించకునేందుకు అందరూ నడుంబిగించిన కష్టపడుతుంటే…కేరళలో మాత్రం క్రైస్తవులు ఇందుకు భిన్నంగా ఉన్నారు. జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యలను గురించి తెలియనివారికి వివరించాల్సిన పాస్టర్లు…ఇలా జనాభా పెంచడం కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఈ విధానంపై అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇదేం పద్దతి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా చేస్తే జనాభా పెరుగుదలను ఎలా ఆపుతారంంటూ ప్రశ్నిస్తున్నారు.
జనాభా పెరుగుదల కోసం వారు ప్రవేశపెట్టిన పథకాలను చూసి అంతా తప్పుబడుతున్నారు. జనాభా పెరిగితే సహజవనరులు పెరుగుతాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. కేరళలోని ఓ చర్చి క్రైస్తవుల జనాభాను రెట్టింపు చేసేందుకు ఓ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేరళలోని ఫేమస్ కాథలిక్ చర్చి డియోసెస్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాన్ని అందరూ తిట్టిపోస్తున్నారు. యూపీ లాంటి రాష్ట్రంలో జనాభా నియంత్రణకు అక్కడి ప్రభుత్వం ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం తీసేస్తామని ప్రకటించింది. కేరళలో మాత్రం ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారికి ఆర్థిక ప్రోత్సాహాకాలు అందజేస్తామని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తోంది.
2000వ సంవత్సరం తర్వాత వివాహం చేసుకున్న జంటలకు 5లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి నెలకు ఐదు వందల రూపాయల నుంచి 15వందల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అక్కడి చర్చి ప్రతినిధులు నిర్ణయించారు. చర్చి ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీ సెలబ్రెషన్స్ లో ఈ ప్రకటన చేశారు. కోవిడ్ మహమ్మారి ఉద్రుతి తగ్గిన తర్వాత దరఖాస్తులు తీసుకుని అర్హులైన వారికి ఆగస్టు నెల నుంచి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.
ఇలా ఆర్థిక సాయం చేయడం మంచి విషయమని ఫాదర్ జోసెఫ్ కుట్టియంకల్ తెలిపారు. కేరళ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవుల జనాభా భారీగా తగ్గిందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు దేశంలో ఉన్న క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా కేరళలోనే నమోదు అయ్యేది. అలాందిటి రాను రాను ఈ సంఖ్య చాలా వరకూ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో కేవలం 18.38 శాతం మంది మాత్రమే క్రైస్తవులు మిగిలారట. ఇలా క్రమంగా తగ్గిపోతున్న జనాభాను నివారించడం కోసం కాథలిక్ చర్చి జనాభా ఎక్కువగా ఉన్నవారికి ప్రోత్సాహకంగా నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయంతో పాటు మరో విస్మయం కలింగే వివాదాస్పద నిర్ణయం కూడా తీసుకోనున్నారు. ఎవరైన క్రైస్తవుల్లో నాలుగో బిడ్డకు జన్మనిచ్చినట్లయితే ఆ మహిళలకు ఫ్రీగా డెలివరీ చేయిస్తామని…ప్రకటించడం గమనార్హం. అంతేకాదు ఎక్కువ మంది పిల్లలున్న క్రైస్తవ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు తమ ఇంజనీరింగ్ కళాశాల్లో చదవిస్తూ..స్కాలర్ షిప్ లు అందజేస్తామని ప్రకటించారు.