Mumbai police: ముంబై పోలీసులు చేసిన పనికి సెల్యూట్ చేస్తారు.

ముంబైలో కరోనా వేళ మానవత్వం పరిమళించింది. కర్ఫ్యూ,లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే పలువురు పేద కార్మికులు ఆకలి చావుల బారిన పడుతున్నారు. రెక్కాడితే డొక్కాడని జీవితాలు ఇప్పుడు వాళ్ల వలస గ్రామాలకు బయలుదేరారు. అంతేకాదు రోజు కూలీలు, వలస కార్మికుల కడుపులపై కర్ఫ్యూలు దండయాత్ర చేస్తున్నాయి. తాజాగా ముంబైలో ఓ వృద్ధ మహిళ పూలు అమ్ముకుంటూ జీవితం సాగిస్తోంది. ఆమె రోజంతా కష్టపడితేనే రూ.500 సంపాదనతో తన కుటుంబం రోజు పోషణ వెల్లదీస్తోంది.
ఈ నేపథ్యంలో కర్ఫ్యూ కారణంగా ఆమె దందాకు గండి పడింది. తాజాగా ఆమె కర్ఫ్యూ వేళ పూలు అమ్ముతుండగా అటు వచ్చిన ముంబై పోలీసులు ఆమె వ్యాపారం ముగించాలని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అందుకు ఆమె తనకు పూలు అమ్మకుంటే పూట గడవదని, రోజూ తాను సంపాదించే రూ.500 తోనే కుటుంబ జీవితం గడుస్తుందని వాళ్లను రిక్వెస్ట్ చేసింది. ఇది తెలుసుకున్న ఖాకీల మనస్సు కరిగిపోయింది. ఆమె కర్ప్యూ ముగిసే వరకూ ఇంటి వద్దే ఉండాలని, ఆమె సంపాదించే రూ.500 తామే అందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటన నెటిజన్లను కదిలించింది. ముంబై పోలీసులకు వారంతా సెల్యూట్ చేస్తున్నారు.