CIVID-19 EFFECT: 3 గంటల్లో అయిపోవాలి.. 31 మందికి మించకూడదు.. లేదంటే రూ.లక్ష ఫైన్!పెళ్లిళ‍్లపై రాజస్తాన్ సర్కారు కఠిన ఆంక్షలు!!

పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో అపురూపమైనది. బంధుమిత్రుల సమక్షంలో ఉన్నదాంటో ఘనంగా వివాహం చేసుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని పెళ్లికి బంధువులను పిలవాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. కరోనా నిబంధనలు పాటిస్తూ పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకునే రోజులు రావడం నిజంగా బాధాకరం. కరోనా కల్లోలం నేపథ్యంలో వివాహ వేడుకలపై దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
తాజాగా రాజస్థాన్ సర్కారు పెళ్లి సంబురాలపై కఠిన ఆంక్షలు పెట్టింది. గతంలో పెళ్లికి 50 మంది రావొచ్చని చెప్పిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం.. ప్రస్తుతం ఆ సంఖ్యను 31కి తగ్గించింది. 31 మందికన్నా ఒక్కరు ఎక్కువగా వచ్చినా లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అంతేకాదు పెళ్లి తంతు కేవలం 3 గంటల్లో ముగించాలని ఆదేశించింది. కాస్త సమయం దాటినా లక్ష రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుందిన చెప్పింది.
అటు పెళ్లి వేడుకపై తప్పుడు సమాచారం ఇచ్చి అధికారుల టైం వేస్ట్ చేస్తే రూ. 5 వేలు సర్కారుకు కట్టక తప్పదని తేల్చి చెప్పింది. అవసరం అయితే కుటుంబ సభ్యులు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కు సంబంధిత పెళ్లి ఫోటోల్ని చూపించాల్సి ఉంటుందని చెప్పింది. ఈమేరకు తాజాగా కోవిడ్ మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజు పెరగడంతో మే 17 వరకు లాక్ డౌన్ ఆంక్షల్ని పొడిగించింది. గత 24 గంటల్లో రాజస్థాన్‌లో కొత్తగా 17,296 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 154 మంది మరణించారు.