Raj Kundra: పోర్న్ వీడియోల గురించి ఇండియన్ లా ఏం చెబుతోంది…చూడటం, నిర్మించడం నేరమా?

ప్రముఖ బిజినెస్ మెన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోర్న్ వీడియోలు తీశాడన్న కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమతో రాజ్ కుంద్రా అడల్ట్ వీడియోలు తీశాడని పలువురు హీరోయిన్లు చేసిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు దాదాసు ఐదు నెలలుగా సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఆయన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం కుంద్రా పోలీసు కస్టడీలో ఉన్నాడు. అసలు ఫోర్నోగ్రఫీ గురించి ఇండియన్ లా ఏం చెబుతోంది? ఫోర్న్ వీడియోలు తీయడం, చూడటం చట్టరీత్య నేరామా? రాజ్ కుంద్రాపై నేరం రుజువైనట్లయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షపడనుంది? ఓసారి చూద్దాం.
ఇక ఈ సెక్షన్ల గురించి వివరంగా చెప్పుకోవాలంటే…సెక్షన్ 292 అనేది అశ్లీలం అంటే ఏంటి అనేది వివరిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం వీటిని వీడియోలు తీయడం, పంపిణీ చేయడం నేరంగా పరిగణిస్తూ.. మొదటిసారి అయినట్లయితే మూడు సంవత్సరాలు జైళు శిక్ష, రెండోసారి అయితే 5 సంవత్సరాలు శిక్ష పడుతుంది. ఇక సెక్షన్ 293 అనేది అశ్లీల వీడియోలు తీసి వాటిని 20 సంవత్సరాలలోపు యువతకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి సంబంధించినది. ఈ సెక్షన్ 294 అనేది పబ్లిగ్ లో తమ చర్యలు, పాటల ద్వారా అశ్లీలాన్ని ఫోకస్ చేయడం గురించి చెబుతుంది. పబ్లిక్ గా అశ్లీలపాటు పాడటం, మాట్లాడటం అనేది నేరంగా పరిగణిస్తోంది. ప్రస్తుతం కుంద్రాపై ఈ మూడు సెక్షన్ల కింద ముంబై పోలీసులు కేసు ఫైల్ చేశారు.
ఒకవేళ ఈ చిత్రాల్లో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్లయితే…ఇతర సెక్షన్లు ఉంటాయి. వాటి కింద కేసు నమోదు చేస్తారు. పిల్లల విషయంలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ సెక్స్వల్ అఫెన్సెస్ పోకో చట్టం 2012 కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఈ చట్టంలో సెక్షన్ 14 ప్రకారం పోర్నోగ్రఫీలో పిల్లలను భాగం చేయడం తీవ్రనేరంగా పరిగణిస్తారు. ఇక మహిళ విషయంలోనూ ఇన్ డీసెంట్ రిప్రజెంటేషన్ ఆప్ వుమెన్ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తారు. కుంద్రాపై ఈ చట్టంలోని సెక్షన్ 3,4,6,7కింద కూడా కేసులు నమోదు చేశారు.
ఇవే కాదు ఐటీ చట్టం సెక్షన్ 67ఏ గురించి ఓసారి పరిశీలించినట్లయితే…పోర్నో గ్రఫీ విషయంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 67ఏను కూడా ప్రయోగిస్తారు. అశ్లీల కంటెంట్ ను ఎలక్ట్రానిక్ రూపంలో పబ్లిష్ చేయడం, పంపిణీ చేయడం అనేది ఈ సెక్షన్ కింద తీవ్రనేరంగా పరిగణిస్తారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 10 లక్షల జరిమాన విధిస్తారు. రెండోసారి నేరం చేసినట్లయితే 7 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు.
ఏది ఏమైనా ముంబై పోలీసులు ఫిబ్రవరిలో కేసు నమోదు చేసి…పూర్తిస్థాయిలో పకడ్బందీగా విచారణ చేసిన అనంతరం కుంద్రాను బలమైన సాక్ష్యాలతో అరెస్టు చేశారు.