7 ఏండ్లలోపు శిక్ష ప‌డే కేసుల్లో అవ‌స‌ర‌మైతేనే నిందితులను అరెస్ట్ చేయండి.. కరోనా తీవ్రత నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

7 ఏండ్లలోపు శిక్ష ప‌డే కేసుల్లో అవ‌స‌ర‌మైతేనే నిందితులను  అరెస్ట్ చేయండి.. కరోనా తీవ్రత నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశంలో కరోనా కొనసాగుతున్న వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్ల‌లోపు జైలు శిక్ష ప‌డే నేరాల విష‌యంలో.. నిందితుల‌ను అవ‌స‌ర‌మైతేనే అరెస్టు చేయాలని వెల్లడించింది.  ఆదేశించింది. దేశ వ్యాప్తంగా జైళ్లలో ఉన్న ఖైదీ లంద‌రికీ స‌రైన వైద్య స‌దుపాయాలు అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క‌రోనా బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న ఖైదీల‌ను వెంటనే గుర్తించాలని చెప్పింది. వారిని వీలైనంత తర్వరగా విడుదల అయ్యేలా చూడాలని రాష్ట్రాలు, యూటీలు ఏర్పాటు చేసిన అత్యున్న‌త క‌మిటీల‌కు చెప్పింది. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా జైళ్ల‌లో ర‌ద్దీని త‌గ్గించే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

అటు ఇప్ప‌టికే పెరోల్‌పై ఉన్న వాళ్ల‌కు మ‌రో 90 రోజులు పెరోల్ పొడిగించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతేడాది  క‌రోనా నేప‌థ్యంలోనే పలువురు నిందితుల విడుదలపై కీలక నిర్ణయం వెల్లడించింది.  తాత్కాలిక బెయిల్ ఖైదీలు, పెరోల్‌పై ఉన్న ఖైదీలు,  ఏడేళ్ల కంటే త‌క్కువ శిక్ష ప‌డే నేరాల్లో విచార‌ణ ఎదుర్కొంటున్న ఖైదీలను రిలీజ్ చేసే అంశాన్ని ప‌రిశీలించ‌డానికి క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్రాలు, యూటీల‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.   

అంతేకాదు.. జైళ్ల‌లో క‌రోనా వ్యాప్తిని అదుపులో ఉంచ‌డానికి త‌ర‌చూ ఖైదీలు, జైలు అధికారుల‌కు కరోనా టెస్టులు చేశాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఖైదీల‌కు కరోనా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జైళ్ల‌లో 4 ల‌క్ష‌ల‌కుపైగా ఖైదీలు ఉన్నారు. కొన్ని జైళ్ల‌లో సామ‌ర్థ్యానికి మించి ఉన్న‌ట్లు  కోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖైదీల ఆరోగ్యం విషయంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని తేల్చి చెప్పింది. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా.. జైల్లోని ఖైదీలతో పాటు అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. అటు దేశ వ్యాప్తంగా జైల్లలో ఉన్న ఖైదీల ఆరోగ్యంపై వైద్య అధికారులతో వాకబు చేయించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.   

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d