కరోనా కల్లోలంలో సెంట్రల్ విస్టా నిర్మాణమా? కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షాల ఆగ్రహం!

కరోనా విజృంభణ నేపథ్యంలో నూతన పార్లమెంట్ భవన నిర్మాణం కొనసాగిస్తున్న కేంద్రంపై విపక్షాలు ఒంటికాలు మీద లేశాయి. దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలకు మాత్రమే ప్రభుత్వాలు అనుమతి ఇస్తుండగా.. సెంట్రల్ విస్టా నిర్మాణం ఎలా చేపడుతాయని ప్రశ్నించాయి. ఈ నిర్మాణం అత్యవస సేవ కిందికి వస్తుందా? అని క్వశ్చన్ చేశాయి. ఢిల్లీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నా.. కార్మికులతో పనులు చేయించడం ఏంటని మండిపడ్డాయి.
ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సటైరికల్ ట్వీట్ చేశారు. సెంట్రల్ విస్టా నాట్ ఎసెన్షియల్.. సెంట్రల్ గవర్నమెంట్ విజన్ ఎసెన్షియల్ అని వ్యాఖ్యానించారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ తరహా నిబంధనల వేళ కార్మికులతో పనిచేయించి కేంద్రం తీవ్ర నేరానికి పాల్పడుతుందని మండిపడ్డారు. 20 వేల కోట్ల తో చేపడుతున్న ఈ నిర్మాణాన్ని మెదీ తన వ్యక్తిగతంగా భావించడం సరికాదన్నారు. ప్రజా క్షేమం దృష్ట్యా ఈ నిర్మాణం ఇప్పుడు అవసరం లేదన్నారు.
ఏప్రిల్ 19 నుంచి ఢిల్లీలో కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అక్కడ రోజుకు సుమారు 3 వందల మందికి పైగా కరోనాతో చనిపోతున్నారు పాజిటివ్ రేటు 32.72గా ఉంది. అయినా సెంట్రల్ విస్టా నిర్మాణంలో భాగంగా పలు పనులు కొనసాగుతున్నాయి. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ విజ్ఞప్తి మేరకు సెంటర్ విస్టా లోపలి భాగంలో నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ అధికారులు సైతం ఈ నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీపీడబ్ల్యూ కూడా అందుబాటులో ఉన్న కార్మికులతో పనులు కొనసాగించనున్నట్లు చెప్పింది.
తృనమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు డెరేక్ ఓబ్రెయిన్ సైతం కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ భవనానికి పెట్టే ఖర్చుతో దేశంలో 80 శాతం మందికి కరోనా వ్యాక్సీన్లు ఇవ్వొచ్చన్నారు. ఈ సమయంలో సెంట్రల్ విస్టా అవసరమా అని ప్రశ్నించారు. ఇప్పటికే మోదీ తన పెంపుడు నెమలి కోసం ఓ భవనాన్ని నిర్మాంచారన్న ఆయన.. అమిత్ షా కూడా తన పెంపుడు పక్షులు, జంతువుల కోసం మరో భవనాన్ని నిర్మిస్తారని విమర్శించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం సెంట్రల్ విస్టా నిర్మాణ పనులపై కేంద్రానికి చురకలు పెట్టారు. మోడీ-షా ద్వయానికి హృదయం లేదని విమర్శించారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎంపీ నిధులు విడుదల చేయని మోడీ.. సెంట్రల్ విస్టా నిర్మాణానికి మాత్రం అడ్డగోలుగా నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నిధులు కరోనాను ఎదుర్కొనేందుకు ఇచ్చే నిధులకన్నా ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు.
రాజ్ పత్ నుంచి రాష్ట్రపతి భవన్ మీదుగా ఇండియా గేట్ వరకు 3 కిలోమీటర్ల పరిధిలో సెంట్రల్ విస్టా నిర్మాణంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నేషన్ పవర్ కారిడార్ గా నామకరణం చేశారు. ప్రధానమంత్రి నూతన నివాసాన్ని 15 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో 10 భవనాలు కడుతున్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మరో మూడు అంతస్తులు ఉండనున్నాయి.