తమిళనాడు సీఎంగా ఎంకే స్టాలిన్ ప్రమాణం స్వీకారం.. కరోనా నేపథ్యంలో సాదాసీదాగా వేడుక.. 34 మందితో నూతన కేబినెట్ ఏర్పాటు

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ స్టాలిన్‌తో ప్రమాణం చేయించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో రాజ్ భనన్ వేదికగా ఈ వేడుక సాదాసీదాగా జరిగింది. ముఖ్యమైన అతిథులను మాత్రమే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. కరోనా నిబంధనలకు లోబడి ఈ కార్యక్రమం కొనసాగింది.
తమిళనాడు నూతన కేబినెట్ లో 34 మందికి అవకాశం కల్పించారు స్టాలిన్. గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారితో పాటు యువకులు, కొత్త వారికి స్థానం కల్పించారు. అంతకు ముందు కొత్తగా ఎన్నికైన డీఎంకే ఎమ్మెల్యేలు అంతా ఆ పార్టీ ప్రధాన కార్యాలయం.. అన్నా అరివాయంలో సమావేశం అయ్యారు. ఎంకే స్టాలిన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి స్టాలిన్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. స్టాలిన్ రిక్వెస్టు మేరకు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ పురోహిత్ ఆహ్వానించారు.
అటు మే 2న వెలువడిని అసెంబ్లీ ఫలితాల్లో డీఎంకే సంచలన విజయం సాధించింది. మొత్తం 234 అంసెంబ్లీ స్థానాలకు గాను.. డీఎంకే కూటమి 156 సీట్లను గెల్చుకుంది. అన్నాడీఎంకే కూటమిని అధికారం నుంచి తప్పించింది. అన్నాడీఎంకే కూటమికి కేవలం 78 సీట్లు మాత్రమే లభించాయి. దీంతో తమిళ నాట 10 ఏండ్ల తర్వాత డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైంది.