ముచ్చటగా మూడోసారి.. బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం

ముచ్చటగా మూడోసారి.. బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం

తాజాగా విడుదల అయిన అసెంబ్లీ ఫలితాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ.. మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా కారణంగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా గవర్నర్ భవన్లో సాదాసీదాగా ప్రమాణం చేశారు. గవర్నర్ జగదీప్ దినకర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ సంర్భంగా మమతాను గవర్నర్ అభినందించారు.

మే 2న విడుదల అయిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 292 స్థానాల‌కు గాను 213 స్థానాల్లో మమతా పార్టీ టీఎంసీ విజ‌యం సాధించింది. దీంతో తృణ‌మూల్ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అటు ఎన్నికల ఫలితాల త‌ర్వాత బెంగాల్‌లో  భారీగా హింస చెల‌రేగింది. ఈ దాడుల్లో 12 మంది చ‌నిపోయారు. ఈ హింస‌పై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.  గవర్నర్ జగదీప్ తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితి గురించి ఆరా తీశారు.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d bloggers like this: