LOCKDOWN IN ODISHA: ఒడిషాలో 14 రోజుల లాక్‌డౌన్.. కరోనా కట్టడికి పట్నాయక్ సర్కారు కీలక నిర్ణయం!

ఒడిశాలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు విజృంభించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 14 రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది. మే 5 నుంచి 19 వరకు రాష్ట్ర వాప్తంగా లాక్ డౌన్ ఉంటుంది ప్రకటించింది.
లాక్ డౌన్ కు సంబంధించిన గైడ్ లైన్స్ ఒడిషా సర్కారు రిలీజ్ చేసింది. కూరగాయాల కోసం ఇంటి నుంచి కేవలం అర కిలోమీటర్ మాత్రమే వెళ్లాలని సూచించింది. అటు దుకాణాలు సైతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే తెరిచి ఉంచాలని వెల్లడించింది. ఒడిశాలో శనివారం ఒకే రోజు 8,015 మందికి కరోనా సోకింది. 14 మంది మృతి చెందారు. ఒడిశాలో ఇప్పటి వరకు కరోనాతో 2,068 మంది కన్నుమూశారు.
రోనా కట్టడికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు సైతం లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. వారంపాటు లాక్‌డౌన్ విధించిన ఢిల్లీ సర్కారు.. మరో వారం పాటు కొనసాగించనున్నట్లు వెల్లడించింది. పలు రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ కొనసాగిస్తున్నాయి.
దేశంలో గత 24 గంటల్లో 3,92,488 మందికి కరోనా సోకింది. 3,689 మంది చనిపోయారు.