Karnataka : కర్నాటకలో వ్యాపారవేత్త సూసైడ్…నోట్ లో బీజేపీ ఎమ్మెల్యే పేరు..!!

కర్నాటకలోని బెంగళూరులో ఓ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తన కారులో తలపై రివాల్వర్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…వైట్ ఫీల్డ్ నివాసితుడైన ప్రదీప్ ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ ను రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నోట్ లో బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలితో సహా ఆరుగురి పేర్లను రాశాడు. తన ఆత్మహత్యకు వీరే కారణమంటూ పేర్కొన్నాడు. కగ్గలిపురం సమీపంలో ప్రదీప్ ఆత్మహత్యకు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి : ఆ విషయంలో అస్సలు బాధపడటం లేదు…చాలా హ్యాపీగా ఉన్నా…!!
ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే లింబావలి స్పందించారు. సూసైడ్ నోట్ లో నా పేరు ఉందని తెలుసుకున్నా. ప్రదీప్ 2010 నుంచి 2013 మధ్య కాలంలో నా సోషల్ మీడియాను హ్యాండిల్ చేసేవాడు. ప్రదీప్ తన వ్యాపారానికి సంబంధించిన విషయాలను చర్చించాడు. తన భాగస్వాములతో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోమని చెప్పాను. వ్యాపారంలో ఎంత పెట్టుబడి పెట్టావని కూడా నేను అడగలేదు. సమస్య పరిష్కారం కాగానే ప్రదీప్ నా వద్దకు వచ్చి ధన్యవాదాలు చెప్పాడు. అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో….నోట్ లో నా పేరు ఎందుకు రాశాడో తనకు తెలియదని…బీజేపీ ఎమ్మెల్యే లింబావలి పేర్కొన్నారు. కాగా కర్నాటకలో గతంలో ఇద్దరు కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.