Ramdev Baba: రాందేవ్ బాబాపై పరువు నష్టం దావా…రూ.1000కోట్లు చెల్లించాల్సిందే!

యోగా గురువు రాందేవ్ బాబాపై పరువు నష్టం దావా కేసు నమోదైంది. కరోనాను నియంత్రించడంలో అల్లోపతి వైద్యం ఫేయిల్ అయ్యిందంటూ…పనికిమాలిన ఆరోపణలు చేశారు. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ సీరియస్ అయ్యింది. ఉత్తరాఖండ్ శాఖ వెయ్యికోట్ల పరువు నష్టం దావా వేసింది. కరోనాను కట్టడి చేసే విషయంలో అల్లోపతి వైద్యంపై తాను చేసిన ప్రకటనలపై క్షమాపణ కోరుతూ వీడియోను పోస్టు చేయకపోయినా…పదిహేను రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పకపోయినా…వెయ్యికోట్ల పరువు నష్టం మాత్రం చెల్లించాల్సిందేనని ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ తమ పరువు నష్టం దావా నోటిసుల్లో పేర్కొంది. రాందేవ్ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ సీఎం తీర్థసింగ్ రావత్ కు కూడా ఐఏంఏ ఉత్తరాఖండ్ శాఖ లేఖ రాసింది.
ఇవికూడా చదవండి: గడువు ముగిసింది…కోర్టును ఆశ్రయించిన వాట్సాప్!
అయితే అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఐఎంఏ తోపాటు డాక్టర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అల్లోపతి ఒక కుంటి శాస్త్రం…హైడ్రోక్సీక్లోరోక్విన్ విఫలం అయ్యింది. ఇప్పుడు రెమ్ డెసివిర్, ఐవర్ మెక్టిన్, ఫ్లాస్మా థెరపీలు విఫలమయ్యాయి. ఫాబిఫ్లు, స్టెరాయిడ్లతో సహా ఇతర యాంటీ బయాటిక్స్ అన్నీ కూడా విఫలం చెందాయయంటూ రాందేవ్ బాబా ఆరోపించారు. ప్రాణవాయువు కొరత కంటే అల్లోపతి మందల వల్లే లక్షలాది మంది కోవిడ్ రోగులు మరణించాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాందేవ్ వ్యాఖ్యలపై వైద్య సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ప్రజల కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా…విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 12వందల మంది వైద్యుల త్యాగాన్ని కించపరచారంటూ ఐఎంఏ మండిపడింది. లీగల్ నోటీసులు ఇవ్వడంతోపాటు పరువు నష్టం దావా వేస్తామని ఇదివరకే అసోసియేషన్ ప్రకటించింది. అందులో భాగంగానే రాందేవ్ బాబాపై వెయ్యికోట్ల పరవు నష్టం దావా వేసింది ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ.