Alcohol Home Delivery: లిక్కర్ హోం డెలివరీకి ఆ రాష్ట్ర సర్కార్ అనుమతి!

ఢిల్లీ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కేజ్రివాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం…ఆన్ లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియా కంపెనీల మద్యం కానీ విదేశాలకు చెందిన మద్యాన్ని అయినా డైరెక్టుగా ఇంటికి డెలివరీ చేసుకునేందుకు సర్కార్ పర్మిషన్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి: నెటిజన్ కు క్లాస్ పీకిన మంత్రి కేటీఆర్ !
కరోనా రెండో దశలో వైరస్ విజృంభించడంతో లాక్ డౌన్ ఆంక్షలను ఢిల్లీలో అమలు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ చట్టాలను సవరిస్తూ…ఢిల్లీ అబ్కారీ శాఖ ప్రకటన చేసింది. దాని ప్రకారం ఎల్ -13 లైసెన్సులు ఉన్న షాపులు మద్యాన్ని హోం డెలివరీ చేసుకోవచ్చు.కానీ ఖచ్చితంగా ఆర్డర్ మాత్రం మొబైల్ లేదా ఆన్ లైన్ వెబ్ పోర్టల్ ద్వారా జరగాల్సిందే. అయితే హాస్టళ్లు, కార్యాలయాల సంస్దలకు మాత్రం మద్యం డెలివరీ ఉండదన్నారు. ఎల్ -13 లైసెన్సును లేని వారు మధ్యం హోం డెలివరీ చేయరాదన్న నిబంధనలు ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీ కొత్త ఎక్సైజ్ చట్టం ప్రకారం మొబైల్ యాప్ ద్వారా లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసినవారికి మధ్యం షాపులు హోం డెలివరీ చేయనున్నారు. పాత ఎక్సైజ్ చట్టం నిబంధనల ప్రకారం ఎల్ -13 లైసెన్స్ ఉన్న మధ్యం పాపులు మాత్రమే ఈ-మెయిల్ ఫ్యాక్స్ ద్వారా మద్యం ఆర్డర్ వస్తే హోం డెలివరీలను నిర్వహింస్తుండేవి.