DRDO COVID-19 DRUG: ప్యాకెట్ ఓపెన్ చేసి నీళ్లలో కలిపి తాగితే కరోనా ఖతం.. కోవిడ్-19 కట్టడికి డీఆర్డీవో కొత్త డ్రగ్.. అత్య‌వ‌స‌ర వినియోగానికి డీసీజీఐ అనుమ‌తి

DRDO COVID-19  DRUG: ప్యాకెట్ ఓపెన్ చేసి నీళ్లలో కలిపి తాగితే కరోనా ఖతం.. కోవిడ్-19 కట్టడికి డీఆర్డీవో కొత్త డ్రగ్.. అత్య‌వ‌స‌ర వినియోగానికి డీసీజీఐ అనుమ‌తి

కరోనాపై పోరుకు ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ రంగంలోకి దిగింది. కోవిడ్-19 కట్టడికి  మ‌రో కీల‌క అస్త్రం డాక్ట‌ర్ల‌కు అందించేందుకు డీఆర్డీవో చేసిన ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ సంస్థ త‌యారు చేసిన 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్ లేదా 5-డీజీ డ్రగ్ అత్య‌వ‌స‌ర వినియోగానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా అనుమ‌తి ఇచ్చింది. ఇది స్వ‌ల్ప నుంచి మోస్త‌రు క‌రోనాతో బాధ‌ప‌డుతున్న పేషెంట్ల‌పై బాగా ప‌ని చేయనున్నట్లు వెల్లడించింది.  క‌రోనా పేషెంట్ల‌కు ప్ర‌ధాన చికిత్స చేస్తూ.. అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇస్తే వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని డీఆర్డీవో తెలిపింది.   

లేదా 5-డీజీ డ్రగ్   జెన‌రిక్ మాలిక్యూల్‌, గ్లూకోజ్ అన‌లాగ్ కావ‌డం మూలంగా దీని ఉత్ప‌త్తి చాలా సులువ‌ని  తెలిపింది. పెద్ద మొత్తంలో దీన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని వెల్లడించింది. ఈ మందు వాడిన  పేషెంట్ల‌లో చాలా మందికి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ లో నెగ‌టివ్‌గా తేలిన‌ట్లు డీఆర్డీవో తెలిపింది. ఈ డ్ర‌గ్ పొడి రూపంలో ఉండి ప్యాకెట్ల రూపంలో లభిస్తుంది. దీనిని నీళ్ల‌లో క‌లుపుకొని తాగితే చాలని చెప్పింది. ఇది కరోనా వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి వెళ్లి  దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీవో ప్రకటించింది.

ఈ ఔషధాన్ని డాక్ట‌ర్ రెడ్డీస్ లేబొరేట‌రీస్‌తో క‌లిసి డీఆర్డీవో ల్యాబ్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ మెడిసిన్ అండ్ అలైద్ సైన్సెస్ డెవలప్ చేసింది. ఇది క‌రోనా పేషెంట్లు వేగంగా కోలుకోవ‌డంలో ఉపమోగపడుతుందని  క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ లో తేలింది. పైగా క‌రోనా పేషెంట్ల‌కు కృత్రిమ‌ ఆక్సిజ‌న్ అవ‌స‌రాన్ని కూడా త‌గ్గిస్తుందని  డీఆర్డీవో వెల్లడించింది.

Dont Miss Reading These Articles

One thought on “DRDO COVID-19 DRUG: ప్యాకెట్ ఓపెన్ చేసి నీళ్లలో కలిపి తాగితే కరోనా ఖతం.. కోవిడ్-19 కట్టడికి డీఆర్డీవో కొత్త డ్రగ్.. అత్య‌వ‌స‌ర వినియోగానికి డీసీజీఐ అనుమ‌తి

  1. పింగుబ్యాకు: అనామకం

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d