LOCKDOWN IN BIHAR: బీహార్‌లో ఈనెల 15 వరకు లాక్‌డౌన్.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీఎం నితీష్ నిర్ణయం!

దేశంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. సెకండ్ వేవ్ భయంకరంగా విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసుల వస్తున్నాయి. వందల మంది కరోనాతో కన్నుమూస్తున్నారు. పలు ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు బెడ్లు, ఆక్సిజన్, మందులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి.
తాజాగా బీహార్‌లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నాట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇవాళ్టి నుంచి మే15 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందన్నారు. బీహార్‌లో ఇప్పటి వరకు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింది. అయినా కేసులు ఏమాత్రం తగ్గలేదు. దీంతో కేబినేట్ సమావేశంలో మంత్రులు, అధికారులతో సీఎం నితీష్ చర్చించి లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు బీహర్‌లో ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. గడిచిన 24 గంటలలో అక్కడ కొత్తగా 11,407 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగా 1,07,667 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.