పెగాసస్ అంటే ఏంటి….ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు..?

పెగాసస్ అంటే ఏంటి….ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు..?

దేశాన్ని కుదిపేసే ఓ సంచలనం బయటపడింది. విదేశీ మీడియా ఈ సెన్సెషనల్ కథనాలను ప్రచురించింది. భారతదేశంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని బయటపెట్టింది. దేశంలోని కీలకనేతలు, జర్నలిస్టులు ఆఖరుకు సుప్రీంకోర్డు జడ్జీల ఫోన్లను కూడా హ్యాక్ చేశారంటూ సంచలన కథనాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ తన మంత్రివర్గంలోని పలువరు మంత్రులు, విపక్షనాయకులు, సుప్రీంకోర్టు జడ్జీలు, ఆర్ఎస్ఎస్ నేతలు, జర్నలిస్టులు ఇలా ముఖ్యఅధికారులు, దౌత్య అధికారుల ఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు విదేశీ మీడియా వాషింగ్టన్ పోస్ట్ గార్డియన్ లు సంచలన కథనాలను ప్రచురించాయి.2019 ఎలక్షన్ సమయంలో ఇంజ్రాయోల్ దేశానికి చెందిన స్పైవేర్ పెగాసస్ ద్వారా ఈ ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆ వార్తల ప్రతికలు రాసుకొచ్చాయి. దీంతో దేశంలో ఇప్పుడు పెనుదుమారం రేగినట్లయింది. మరోసారి కేంద్రాన్ని షాక్ చేసే పరిణామంగా ఇది పరిణమించందని చెప్పవచ్చు.

ఇక దీనిపై బీజేపీ సీనియర్ నేత సుభ్రహ్మణ్యస్వావి స్వయంగా ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వాషింగ్టన్ పోస్ట్ లండన్ కు చెందిన గార్డియన్ పత్రిక ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ప్రచురించాయని…పెగాసస్ ద్వారా దేశంలో ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని తెలిసిందని..వాస్తవాలు నిర్దారించుకన్న తర్వాత ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనే జాబితా వెల్లడిస్తామంటూ ట్వీట్ చేశారు.

ఇక ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాదాపుగా రెండు డజన్ల సంస్థలు లాయర్లు దళిత ఉద్యమకారులు, జర్నలిస్టుల ఫోన్లను పెగాసస్ ట్యాపింగ్ చేసిందని పేర్కొంది వాట్సాప్ సంస్ధ మొదట ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1400మంది ఫోన్లన ట్యాపింగ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే అప్పటి కేంద్ర సమాచార ప్రసారాశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.

అసలు ఈ పెగాసస్ అంటే ఏంటి? ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు.?

ఇజ్రాయెల్ కు చెందిన SSOఅనే సంస్థ తయారు చేసిన స్పైవేర్ టూల్ పెగాసస్. కొంతమంది టార్గెన్ చేస్తూ నిఘా పెట్టడమే ఈ పెగాసస్ ముఖ్య లక్ష్యం. దీనికోసం ఫోన్లు ఉన్న వినియోగదారులకు ఓ లింక్ ను పంపిస్తారు. దానిమీద క్లిక్ చేసినట్లయితే ఆ యూజర్ ఫోన్ పూర్తిగా ఎవరైతే హ్యాక్ చేస్తున్నారో వారి స్వాధీనంలోకి వెళ్తుంది. యూజర్ కు తెలియకుండానే ఆ టూల్ అతడి ఫోన్ లో ఇన్ స్టాల్ అవుుతుంది. ఒకసారి ఇన్ స్టాల్ అయ్యాక ఫోన్కు సంబంధించిన డేటా మొత్తం ఎటాకర్ పంపిచండం స్టార్ట్ చేస్తుంది. పర్సనల్ డేటాతోపాటు పాస్ వర్డ్స్ కాంటాక్ట్ లిస్ట్ క్యాలెండర్ ఈవెంట్స్ ఈమెయిల్స్ తోపాటుగా లైవ్ వాయిస్ కాల్స్ ను కూడా అది ట్రాక్ చేస్తుంది.

ఇక చివరికి యూజర్ కు తెలియకుండా అతడి ఫోన్ కెమెరాను కూడా మైక్రోఫోన్ను కూడా ఆన్ చేసి విని చూడగలిగే సామార్థ్యం హ్యాకర్ కు ఉంటుంది. ఇప్పుడు ఇక విస్ కాల్ విడియో కాల్ చేసి కూడా ఫోన్ను ఈ కొత్త పెగాసస్ సాఫ్ట్ వేర్ హ్యాక్ చేస్తోందని వాట్సాప్ ఆరోపించింది.

ఎంత మంది ఫోన్లను ట్యాప్ చేసింది….?

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే నెల మధ్యలో దాదాపుగా 20దేశాల్లో దాదాపు 14వందల మందికి పైగా పెగాసస్ ద్వారా హ్యాకింగ్ చేశారని వాట్సాప్ ఆరోపిస్తున్నట్లు విదేశీ మీడియా వెల్లడించింది. ఇప్పటికే పెగాసస్ పై వాట్సాప్ సంస్థ శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా కూడా వేసిందంట.

అయితే ఇదే ఇజ్రాయయలీ పెగాసస్ సంస్థ ఇండియాలో నిఘాకు వినియోగించుకున్నారన్న వార్తలు బయటకు పొక్కడంతో పెను సంచలనమైంది. దీన్ని కేంద్రం చేసిందా లేదా దీనివెనక ఎవరున్నారనది నిగ్గుతేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత భారీ స్థాయిలో ప్రముఖులపై 2019 సార్వత్రిక ఎన్నికల వేళ సాగిన ఈ విషయం ఇప్పుడు దేశాన్ని కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d