Bank Holidays In April 2023: ఏప్రిల్ 2023లో బ్యాంకులకు సెలవులు

Bank Holidays In April 2023: ఏప్రిల్ 2023లో బ్యాంకులకు సెలవులు

ఏప్రిల్, 2023 నెలలో మొత్తంగా దాదాపు 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు (Bank Holidays in April 2023) వస్తున్నాయి. అందులో రెండో, నాలుగో శనివారాలు సహా నాలుగు ఆదివారాలు, పబ్లిక్ హాలీడేలు, వివిధ రాష్ట్రాల్లో పండగలు వంటివి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఆయా సెలవు రోజుల్లో మూసి ఉంటాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ సెలవుల్లోనూ ఆ ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడతాయి. అయితే, ఈ వివరాలు రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉండవు.

ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే..

  1. ఏప్రిల్ 1, 2023:నూతన ఆర్థిక ఏడాది ప్రారంభమవుతున్న క్రమంలో ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. యాన్యూవల్ క్లోజింగ్ రోజుగా దీనిని పరిగణిస్తారు. అయితే, ఐజ్వాల్, షిల్లాంగ్, సిమ్లా, చండీగఢ్ ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులు తెరిచే ఉంటాయి.
  2. ఏప్రిల్ 2,2023:ఏప్రిల్ 2వ తేదీన ఆదివారం వస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉంటాయి.
  3. ఏప్రిల్ 4,2023:మహవీర్ జయంత్ సందర్భంగా దేశంలోని వివిధ నగరాల్లో ఏప్రిల్ 4న బ్యాంకులు మూసి ఉంటాయి.
  4. ఏప్రిల్ 5, 2023:బాబు జగ్‌జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
  5. ఏప్రిల్ 7, 2023:ఏప్రిల్ 7వ తేదీన గుడ్ ఫ్రైడే ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉంటాయి. అయితే, అగర్తలా, అహ్మదాబాద్, గువాహటి, జైపూర్, జమ్ము, సిమ్లా, శ్రీనగర్‌లో మాత్రం తెరిచే ఉంటాయి.
  6. ఏప్రిల్ 8, 2023:ఏప్రిల్ 8న రెండో శనివారం వస్తున్నందున బ్యాంకులు దేశవ్యాప్తంగా మూసి ఉంటాయి.
  7. ఏప్రిల్ 9, 2023:ఈ రోజున ఆదివారం కాబట్టి బ్యాంకులు మూసి ఉంటాయి.
  8. ఏప్రిల్ 14, 2023:డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా దేశవ్యాప్తగా బ్యాంకులు మూత పడనున్నాయి. అయితే ఐజ్వాల్, భోపాల్, డిల్లీ, రాయ్‌పుర్, షిల్లాంగ్, సిమ్లా ప్రాంతాల్లో తెరిచే ఉంటాయి.
  9. ఏప్రిల్ 15, 2023:ఏప్రిలే 15వ తేదీన వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగలు ఉన్నాయి. విషు, బొహాగ్, బిహు, హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ కారణంగా అగర్తలా, గువాహటి, కొచ్చి, కోల్‌కతా, షిమ్లా, తిరువనంతపురంలలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  10. ఏప్రిల్ 16, 2023:ఏప్రిలే 16న ఆదివారం కాబట్టి బ్యాంకులు మూత పడతాయి.
  11. ఏప్రిల్ 18, 2023:జమ్ము అండ్ శ్రీనగర్ ప్రాంతాల్లో షాబ్ ఇ కబర్ కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  12. ఏప్రిల్ 21, 2023:ఈద్ ఉల్ ఫితర్ కారణంగా ఏప్రిల్ 21న అగర్తలా, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
  13. ఏప్రిల్ 22, 2023:ఈ రోజున నాలుగో శనివారంతో పాటు ఈద్ సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  14. ఏప్రిల్ 23, 2023:ఆదివారం సెలవు దినం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉంటాయి.
  15. ఏప్రిల్ 30, 2023:ఈ రోజు ఆదివారం సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూత పడనున్నాయి.

ఏప్రిల్ 2023 నెలలో బ్యాంకులు సెలవుల గురించి అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. బ్యాంకు లావాదేవీలు చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, అవాతరాలు ఏర్పడకుండా చూసుకునేందుకు వీలుంటుంది. ఈ రోజుల్లో బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ సేవలు, ఏటీఎం సేవలు, యూపీఐ వంటివి అందుబాటులో ఉంటాయి.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d