5 STATES ELECTIONS RESULTS: మే 2న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. గతంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? ఫలితాలు ఎలా వచ్చాయి?

ఇవాళ్టితో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ పూర్తికాగా.. బెంగాల్ లో ఇవాళ తుది విడుత ఓటింగ్ జరుగుతోంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. బెంగాల్ పోలింగ్ పూర్తికాగానే ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం వెల్లడి అయ్యే అవకాశం ఉంది. అయితే గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్.. వచ్చిన ఫలితాల గురించి ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
పశ్చిమ బెంగాల్:
రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీఎంసీ 211 స్థానాలు గెలిచింది. సీపీఎం-కాంగ్రెస్ కూటమి 70 సీట్లు గెలిచింది. బీజేపీ 3, ఇతరులు 10 స్థానాల్లో గెలుపొందారు. ఎగ్జిట్ పోల్స్ లో మమతా బెనర్జీ టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పాయి. కానీ ఆయా సంస్థలు చెప్పిన సీట్ల లెక్కలో భారీ తేడాలు కనిపించాయి. చాణక్య మాత్రం కాస్త కచ్చితమైన ఫలితాలు వెల్లడించింది. ఇంతకీ ఆయా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు పరిశీలిద్దాం..
CVOTER– టీంఎంసీ-167, లెఫ్ట్+కాంగ్రెస్-120, బీజేపీ-4, ఇతరులు-3
INDIA TODAY– టీంఎంసీ-243, లెఫ్ట్+కాంగ్రెస్-44, బీజేపీ-4, ఇతరులు-3
CHANAKYA– టీంఎంసీ-210, లెఫ్ట్+కాంగ్రెస్-70, బీజేపీ-14, ఇతరులు-0
ABP–టీంఎంసీ-163, లెఫ్ట్+కాంగ్రెస్-126, బీజేపీ-1, ఇతరులు-4
NDTV–టీంఎంసీ-184, లెఫ్ట్+కాంగ్రెస్-103, బీజేపీ-5, ఇతరులు-2
NEWS NATION–టీంఎంసీ-153, లెఫ్ట్+కాంగ్రెస్-136, బీజేపీ-0, ఇతరులు-5
తమిళనాడు:
ఈ రాష్ట్రంలో మొత్తం 234 స్థానాలు ఉండగా.. ఏఐడీఎంకే 136 సీట్లు గెలిచి జయలలిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డీఎంకే 89, కాంగ్రెస్ 8, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే జయలలిత సర్కారును ఫామ్ చేసింది. ఇంచుమించు అన్ని సంస్థలు చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయి.
SPICK NEWS– ఏఐడీఎంకే- 142, డీఎంకే-87, పీడబ్ల్యూఎఫ్-0, బీజేపీ-1, ఇతరులు-4
CVOTER– ఏఐడీఎంకే- 139, డీఎంకే-78, పీడబ్ల్యూఎఫ్-15, బీజేపీ-0, ఇతరులు-2
INDIA TODAY– ఏఐడీఎంకే- 99, డీఎంకే-132, పీడబ్ల్యూఎఫ్-0, బీజేపీ-0, ఇతరులు-3
NEWS NATION– ఏఐడీఎంకే- 97, డీఎంకే-116, పీడబ్ల్యూఎఫ్-14, బీజేపీ-0, ఇతరులు-7
ABP– ఏఐడీఎంకే- 95, డీఎంకే-132, పీడబ్ల్యూఎఫ్-0, బీజేపీ-1, ఇతరులు-6
CHANAKYA– ఏఐడీఎంకే- 95, డీఎంకే-132, పీడబ్ల్యూఎఫ్-0, బీజేపీ-1, ఇతరులు-6
NDTV– ఏఐడీఎంకే- 103, డీఎంకే-120, పీడబ్ల్యూఎఫ్-0, బీజేపీ-0, ఇతరులు-11
THANTHI TV– ఏఐడీఎంకే- 111, డీఎంకే-99, పీడబ్ల్యూఎఫ్-0, బీజేపీ-1, ఇతరులు-23
కేరళ:
ఈ రాష్ట్రంలో మొత్తం 140 స్థానాలు ఉండగా.. సీపీఎం 58 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 22, సీపీఐ 19, ఐయుఎంల్ 18, బీజేపీ1, ఇతరులు 22 స్థానాల్లో విజయం సాధించారు. ఎల్డీఎఫ్ కూటమి 91 స్థానాల్లో విజయం సాధించి పినరయి విజయన్ అధికారం చేపట్టారు. ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇంచుమించు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి.
CVOTER– యుడీఎఫ్-58, ఎల్డీఎఫ్-78, బీజేపీ-2, ఇతరులు-2
INDIA TODAY– యుడీఎఫ్-43, ఎల్డీఎఫ్-94, బీజేపీ-3, ఇతరులు-0
NEWS NATION– యుడీఎఫ్-70, ఎల్డీఎఫ్-69, బీజేపీ-1, ఇతరులు-0
CHANAKYA– యుడీఎఫ్-57, ఎల్డీఎఫ్-75, బీజేపీ-8, ఇతరులు-0
NDTV– యుడీఎఫ్-57, ఎల్డీఎఫ్-79, బీజేపీ-3, ఇతరులు-1
అసోం:
ఈ రాష్ట్రంలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ 60, కాంగ్రెస్ 26, ఏజీపీ 14, ఏఐయుడిఎఫ్-13, ఇతరులు 13 స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇంచుమించు అన్ని ఎగ్జిట్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి.
CVOTER– బీజేపీ కూటమి-57, కాంగ్రెస్-41, ఏఐయుడిఎఫ్ కూటమి-18, ఇతరులు-10
INDIA TODAY– బీజేపీ కూటమి-90, కాంగ్రెస్-27, ఏఐయుడిఎఫ్ కూటమి-9, ఇతరులు-0
ABP–బీజేపీ కూటమి-81, కాంగ్రెస్-33, ఏఐయుడిఎఫ్ కూటమి-10, ఇతరులు-2
NEWS NATION–బీజేపీ కూటమి-65, కాంగ్రెస్-49, ఏఐయుడిఎఫ్ కూటమి-9, ఇతరులు-3
CHANAKYA–బీజేపీ కూటమి-90, కాంగ్రెస్-27, ఏఐయుడిఎఫ్ కూటమి-9, ఇతరులు-0
NDTV-బీజేపీ కూటమి-73, కాంగ్రెస్-37, ఏఐయుడిఎఫ్ కూటమి-12, ఇతరులు-4
పుదుచ్చెరి
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చెరిలో మొత్తం 30 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ 15 స్థానాల్లోవిజయం సాధించి నారాయణ స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏఐఎన్ఆర్సీ-8, ఏఐడీఎంకే-4, డీంఎంకే-2, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు.