5 STATES RESULTS: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీల హవా.. తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో అధికారం వైపు అడుగులు!

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో అధికార పార్టీల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో రూలింగ్ పార్టీలు మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
బెంగాల్‌లో టీఎంసీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. 160కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వరుసగా మూడోసారి టీఎంసీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. గతంలో 3 స్థానాలున్న బీజేపీ.. ఈసారి భారీగా పుంజుకుని 98 స్థానాల్లో ముందజలో కొనసాగుతోంది. నందిగ్రామ్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెనుకంజలో కొనసాగుతోంది.
అటు కేరళలో వరుసగా రెండోసారి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలోకి రాబోతుంది. ఎల్డీఎఫ్ కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 71 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. విజయన్ రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
అసోంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ కూటమి 79 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
తమిళనాడులోనే అన్నాడీఎంకే అధికారానికి దూరం అయ్యే అవకాశం ఉంది. డీఎంకే మ్యాజిక్ ఫిగర్ 117 ను దాటింది. తమిళనాడు నెక్ట్స్ సీఎంగా స్టాలిన్ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
పుదుచ్చెరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు ఎన్టీఏ కూటమి సైతం పోటా పోటీగా ముందుకు సాగుతోంది.