Mega Star Chiru Waltair Veerayya Censor Review: వాల్తేరు వీరయ్య సీన్లకు పూనకాలే…!!

ఎట్టకేలకు వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్ వచ్చేసింది. చిరంజీవి నటించిన 150 మూడో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ వాల్తేరు వీరయ్య కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బాబి తెరకెక్కించారు. ఇప్పటికే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా హిట్ అవ్వడంతో ఊపు మీద ఉండగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య కూడా రిలీజ్ కు సిద్ధం అవ్వడం విశేషం. గత ఏడాది చిరంజీవికి ఆచార్య రూపంలో ఫ్లాప్ లభించగా గాడ్ ఫాదర్ మాత్రం పాజిటివ్ టాక్ తో గట్టెక్కింది. కానీ అనుకున్నంత బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. దీనికి కారణం గాడ్ ఫాదర్ సినిమాలో చిరు బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ లేకపోవడమే కారణమని పలువురు విశ్లేషకులు చెప్పారు.
ఇప్పుడు వాళ్లు వెలితిని పోగొట్టేలా వాల్తేరు వీరయ్యను దర్శకుడు బాబి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. జై లవకుశ, వెంకీ మామ సినిమా తర్వాత బాగా గ్యాప్ ఇచ్చిన బాబి ఇప్పుడు చిరంజీవితో పాటు రవితేజను కూడా వెంటబెట్టుకుని వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలన్నీ మంచి టాక్ సంపాదించుకున్నాయి. చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె చిరంజీవితో నటించడం తొలిసారి కావడం విశేషం
ఇదికూడా చదవండి: రెమ్యునరేషన్ తో చిరు చిన్నకూతురుకు కాస్ట్లీ గిఫ్ట్…ఎన్ని కోట్లంటే…!!
.
ఇక వాల్తేర్ వీరయ్య సెన్సార్ టాక్ విషయానికి వస్తే ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని తేల్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ పాత్ర సుమారు 45 నిమిషాల పాటు ఉంటుందని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి గతంలో వచ్చినటువంటి ఘరానా మొగుడు, ముఠామేస్త్రి, రౌడీ అల్లుడు తరహాలో ఉందని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు. అయితే సెన్సార్ కాపీలో రీ రికార్డింగ్ ఉండదు. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ రి రికార్డింగ్ కూడా తోడైతే మాస్ సెంటర్లలో పూనకాలు తప్పవని మేకర్స్ చెప్తున్నారు.
వాల్తేరు వీరయ్య రన్ టైం వచ్చేసి రెండు గంటల 35 నిమిషాలు ఉందని చెబుతున్నారు. ఈ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అవుతుందని ఫ్యాన్స్ కు పండగే, అని సినిమా పండితులు చెబుతున్నారు. కాగా ఈ సినిమాతో పాటు బాలయ్య నటించిన వీర సింహారెడ్డి కూడా ఒక రోజు ముందే విడుదల కాబోతోంది. విచిత్రం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ అవడం విశేషం. ఈ నేపథ్యంలో సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ కు డబల్ బోనాంజా అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇక వాల్తేరు వీరయ్య సినిమా విషయానికొస్తే చిరంజీవి చాలా రోజుల తర్వాత మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు అయితే ఈ సినిమా ట్రైలర్ ఇంకా విడుదల కావాల్సి ఉంది అప్పుడే సినిమా పట్ల అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే పూనకాలు లోడింగ్ బాస్ పార్టీ పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి అభిమానులు సైతం ఈ పాటను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిరంజీవిని చాలా రోజుల తర్వాత ఒక మాస్ పాత్రలో చూడటం కొత్తగా ఉందని అభిమానులు చెబుతున్నారు ఇదిలా ఉంటే సినిమాలో సెకండ్ హాఫ్ చాలా బాగుందని కథకు సినిమా మొత్తానికి సెకండ్ ఆఫ్ ఏ ప్రాణమని సెన్సార్ సభ్యులు చెప్పడం విశేషం.