Sonu Sood: సోనూసూద్ తెలుగింటి అల్లుడే…!

దేశంలో ఎంతో మంది ప్రజాసేవకులు ఉన్నారు. ప్రజల శ్రేయస్సే ద్యేయంగా రాజకీయాల్లోకి వచ్చినవారున్నారు. కానీ వారెవరూ చేయలేని పనిని ఒక సినీనటుడు…అది రీల్ లైఫ్ లో విలన్ గా నటించిన సోనూసూద్ చేయడం…దేశ వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. రీల్లో ఎంతోమంది సూపర్ స్టార్ట్ ఉండచ్చుగాక. కానీ రియల్ లైఫ్ లో మాత్రం సోనూసూద్ కు మించిన హీరో మరెవరూ లేరనే చెప్పాలి. సాయం కోరి..తలుపు తడితే చాలు…వెంటనే సాయం అందించే వ్యక్తిగా ఆయన ప్రతిఒక్కరికి సుపరిచితులు.
ఇప్పుడు సోనూసూద్ కు సంబంధించిన వార్త హాట్ టాపిగ్గా మారింది. ఆయన భార్య సొనాలి సూద్ తెలుగు అమ్మాయి. కానీ ఎక్కడ పుట్టారు…ఏ ప్రాంతానికి చెందిన వారనేది మాత్రం తెలియదు. దానిపై ఎలాంి క్లారిటీ లేదు. ఇప్పుడు లేటెస్టుగా సోనూసూద్ ఒక వెబినార్ లో పాల్గొన్న సందర్భంగా తన భార్య గురించి చెప్పుకొచ్చారు. సొనాలి సూద్ ది గోదావరి జిల్లా అని చెప్పారు.
గోదావరి జిల్లా అని చెప్పారు కానీ ఏ ఊరు అనేది ప్రత్యేకంగా చెప్పలేదు. అయినప్పటికీ గోదావరి జిల్లాలో పుట్టిన నేపథ్యంలో ఆమెది ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. తర్వాత చదువుల కోసం ముంబై వెళ్లిపోవడం…అక్కడే స్థిరపడిపోయారు. తర్వాత సోనూసూద్ తో పరిచయం…పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. ఇక్కడి వరకు సోనాలి సూద్ ఆంధ్రప్రదేశ్ కు చెందినవారన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు. సోనూసూద్ ఏపీ అల్లుడనే చెప్పాలి.
ఇదంతా పక్కన పెడితే…తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు సోనూసూద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తనది తెలంగాణ అని చెప్పారు. అయితే….ఆ ఇంటర్వ్యూలో సొనాలి చెప్పిన మాటల్ని వింటే.. ఆమె అలా చెప్పలేదన్న భావన కలుగుతుంది. ముంబైలో స్థిరపడ్డామని..తమ చుట్టాలందరూ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారని…వారింట్లో జరిగే కార్యాలాకు హైదరాబాద్ వస్తుంటానని చెప్పారు. ఇదంత చూస్తే…తాను తెలంగాణ అమ్మాయి…సోనూ సూద్ తెలంగాణ అల్లుడని చెప్పినట్లుగా రాశారు.
గత కొన్నేండ్లుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెటిల్ అయినవాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. అంతమాత్రానా వారంతా తెలంగాణ వాళ్లైపోరు…సోనూ భార్య సొనాలి మాటలను తప్పుగా అర్థంచేసుకునే…ఆయన్ను తెలంగాణ అల్లుడు ఖాతాలో వేశారన్న సందేహం కలుగమానదు. ఇదంతా పక్కపెడితే…సోనూసూద్ తెలుగింటి అల్లుడన్న మాటకు కట్టుపడితే…ఎలాంటి రచ్చ ఉండదు. సోనూ సూద్ తెలుగింటి అల్లుడని ఫిక్స్ అయిపోండి అంతే.