Ram Pothineni New Movie: దసరా కానుకగా విడుదల కానున్న రామ్, బోయపాటి సినిమా

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేశారు. సినిమాలోని బుల్ ఫైటింగ్ సీనులో లుక్ అది! ఆ ఫైట్ భారీగా ఉండబోతుంది
దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉంటాయ్. ఊర మాస్ యాక్షన్ తీయడంలో ఆయన తర్వాతే ఎవరైనా! ‘సింహా’, ‘లెజెండ్’ నుంచి ‘సరైనోడు’, ‘జయ జానకి నాయక’, ‘అఖండ’ సినిమాల్లో ఫైట్స్ ఎలా ఉన్నాయో ప్రేక్షకులు చూశారు.
ఇప్పుడు యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni)తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు బోయపాటి శ్రీను. ఇటీవల సినిమాలో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న సినిమా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫస్ట్ లుక్ చూస్తే… దున్నపోతును రామ్ లాక్కుని వెళుతున్నట్లు ఉంటుంది. అది సినిమాలో బుల్ ఫైటింగ్ సీనులోని స్టిల్ అని తెలిసింది.
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను సినిమా హైలైట్స్‌లో బుల్ ఫైటింగ్ సీన్ ఒకటి కానుందని తెలిసింది. పదకొండు రోజుల పాటు ఆ ఫైట్ తీశారట. దానికి భారీ ఖర్చు అయ్యిందని, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని టాక్.
Ram Bull Fight Action Sequence : బుల్ ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్సు కోసం భారీ లైట్స్ ఉపయోగించారు. హైదరాబాదులోని ఓ ప్రయివేట్ స్టూడియోలో ఆ సీన్ తీశారు. షూటింగ్ చేసేటప్పుడు లైట్స్ కోసం పవర్ కావాలి కదా! వాటికి 28 జెనరేటర్లు అవసరం అయ్యాయని, స్టూడియోలో అన్ని లేకపోవడంతో బయట నుంచి చాలా తెప్పించారని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ సినిమాలో రామ్ జోడీగా యంగ్ సెన్సేషన్, కొత్త హీరోయిన్ శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు. ‘పెళ్లి సందడి’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత రవితేజ ‘ధమాకా’తో భారీ హిట్ అందుకున్నారు. అలాగే, చాలా అవకాశాలు కూడా! ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘అఖండ’ తర్వాత మరోసారి తమన్, బోయపాటి కాంబినేషన్ రిపీట్ అవుతోంది.