ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంట్లో విషాదం..!

బుల్లితెరకు షాక్ తగిలింది. ప్రముఖ టీవీ యాంకర్, సినిమా హీరో మాచిరాజుప్రదీప్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి పాండరంగ కన్నుమూశాడు. గడిచిన కొంత కాలంగా ప్రదీప్ తండ్రి పాండురంగ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఇదిలా ఉంటే యాంకర్ ప్రదీప్ కుటుంబాన్ని కరోనా శాపంలా కాటేసింది. ఈ మధ్య కాలంలోనే యాంకర్ ప్రదీప్ సైతం కరోనా బారిన పడ్డారు. నిత్యం టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీనగా ఉండే యాంకర్ ప్రదీప్. ఈ మధ్య కాలంలోనే 30 రోజుల్లో లవ్ స్టోరీ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ ప్రదీప్ తెలుగులో అన్ని చానెల్స్ లో టాప్ షోలకు యాంకర్ గా అదరగొడుతూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ మాచిరాజు క్వారంటైన్‌లో ఉన్నారు.
ఇవికూడా చదవండి: ఈటెలపై వేటు…కేబినెట్ నుంచి ఔట్…
కాగా ప్రదీప్ కు జరిగిన విషాదంతో తెలుగు బుల్లితెర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఎమ్మెల్యే రోజా, నాగబాబు, అనసూయ, రష్మీ, సుడిగాలి సుధీర్, ఢీ జడ్జ్ పూర్ణ, ప్రియమణి, శేఖర్ మాస్టర్ తదితరులు ప్రదీప్ ను ఓదార్చారు. ముఖ్యంగా ఢీ జడ్జ్ అయిన నటి పూర్ణ ఎంతో బాధతో ప్రదీప్ ను ఓదార్చే ప్రయత్నం చేశారు.