SHOCKING NEWS: TNR NO MORE: కరోనాతో ప్రముఖ సినీ జర్నలిస్టు టీఎన్నార్ కన్నుమూత

ఎందరో ప్రముఖులను బలిగొన్న కరోనా మహమ్మారి.. మరో తెలుగు సినీ జర్నలిస్టును కబలించింది. కాసేపటి క్రితం ప్రముఖ యాంకర్, సినిమా జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్ కరోనాతో చనిపోయారు. కొన్ని రోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇవాళ ఆయన పరిస్థితి మరింత విషమించింది. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది.
యూట్యూబ్ ఫ్లాట్ ఫామ్ నుంచి ఎంతో మంది సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. సినీ దిగ్గజాలు ఊహించలేని ప్రశ్నలను ఆయన అడిగేవారు. ఎవరికీ తెలియన రహస్యాలను వెలికి తీసి క్వశ్చన్ చేసే వారు. ఇంటర్వ్యూకు వచ్చిన వారు సైతం ఆశ్చర్యపోయేలా ఆయన ప్రశ్నలు ఉండేవి. యాంకరింగ్ ఒక్కటే కాదు.. పలు సినిమాల్లోనూ ఆయన నటించారు. తన మార్కు నటనతో చేసింది కొద్ది సినిమాలే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి అందరి చేత వారెవ్వా అనిపించాడు. టీఎన్నార్ గా గుర్తింపు పొందిన ఆయన అసలు పేరు తుమ్మల నరసింహారెడ్డి.
టీఎన్‌ఆర్ అకాల మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యింది. ఆయన మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు, హీరోలు, హీరోయిన్లు సంతాపం తెలిపారు. సోషల్ మీడియా వేదికగా.. శ్రద్ధాంజలి ఘటించారు. టీఎన్నార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.