NBK: అబ్బా ఇలా ఉండాలి పర్ఫెక్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ !

సినీ హీరో నందమూరి బాలకృష్ణ తన 61 వ పుట్టిన రోజును ఇవాళ జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన అభిమానలు చాలా సందడిగా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో అంతా బాలయ్య బాబు గురించిన సందడితో నిండిపోయింది. పుట్టినరోజు సందర్భంగా అఖండ మూవీ నుంచి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటి వరకు రిలీజ్ చేసినవి అన్నీ కూడా మాస్ లాగా ఉంటే…ఈ పోస్టర్ క్లాస్ గా అదరగొట్టింది. ఈ రోజు ఉదయం బాలయ్య బాబు తర్వాతి చిత్రం #NBK107అఫిషియల్ గా ప్రకటించారు. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ ఇచ్చిన గోపిచంద్ డైరెక్షన్ వస్తున్న ఈ సినిమాకు మాంచి ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక దర్శకుడి నుంచి ప్రొడ్యూసర్ల వరకు ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమాకు అన్నీ సరిపోయిన ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
2018లో రిలీజైన జైసింహా తర్వాత బాలయ్యకు సక్సెస్ లేదనే చెప్పాలి. జై సింహా కూడా కమర్షియల్ గా వర్క్ అవుటైనా…అభిమానులకు అంతగా నచ్చలేదు ఈ సినిమా. ఈనేపథ్యంలో అఖండ, #NBK107 వంటి ప్రామిసింగ్ ప్రాజెక్టులు బ్యాక్ టు బ్యాక్ రావడంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. పైగా బాలయ్య బాబు బర్త్ డే కావడంతో పొద్దునే తారక్ బాబాయ్ కు శుభాకాంక్షలు కూడా తెలిపి అభిమానుల్లో మరింత జోష్ నింపాడు. ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. బాబాయ్ అనే పదం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. మొత్తానికి ఇది కదా పర్ఫెక్ట్ బర్త్ డే సెలబ్రేషన్ అంటే అనే విధంగా బాలక్రుష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.