Manchu Lakshmi:కేటీఆర్ కు మంచు లక్ష్మీ ట్వీట్: రచ్చ చేస్తోన్న నెటిజన్లు!

కరోనాకు ఎలాంటి బేదాభిప్రాయాలు లేవు. అందరిమీదా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా సినీ రాజకీయాల నాయకులపై తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో సహా ఎంతో మందికి కరోనా సోకింది. ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేటీఆర్ హోంఐసోలేషన్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ కు ప్రముఖులంతా త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: నీరు ఎక్కువగా తాగుతే ఏమౌతుంది
కేటీఆర్ ఆరోగ్యంపై సినీనటి మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ మంచులక్ష్మీ ఏమని ట్వీట్ చేసిందో తెలుసా….”త్వరగా కోలుకోవాలి బడ్డి….ఇప్పుడైతే నా సినిమాలన్నీ చూసేయ్ ” అంటూ పేర్కొంది. దీన్ని చూసిన నెటిజన్లు ఊరుకుంటారా…రచ్చ రచ్చ చేశారు.
అక్కా అదే జరిగితే మంత్రి కేటీఆర్ కు అసలు ఊపిరాడుతుందా…అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరైతే ‘‘నీ సినిమాలు చూడటం కంటే కరోనాతో ఉండటం బెటర్’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘బడ్డీ ఏంటి.. కేటీఆర్ గారు నీ ఫ్రెండా.. ఒక రాష్ట్రానికి మంత్రి. గౌరవంగా ఎలా మాట్లాడాలో నేర్చుకో’’అని సలహాలు కూడా ఇస్తున్నారు. మంచులక్ష్మీ కామెడీగా చేసిన ఈ పంచ్ లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మీరూ చదవండి.