Mahesh Babu: తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న గౌతమ్!

తన తనయుడిని చూసి నమ్రతా శిరోద్కర్ మురిసిపోతోంది. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడని గౌతమ్ ఘట్టమనేని చూసి తెగ సంబురపడుతోంది. సినిమాల కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏవిధంగా హార్డ్ వర్క్ చేస్తారో అందరికీ తెలసిందే. డైరెక్టర్ ఆశించిన విధంగా ఔట్ ఫిట్ ను అందించేందుకు ఎంతగానో కష్టపడుతాడు. అవే లక్షణాలు ఇప్పుడు తన కుమారుడు గౌతమ్ కు వచ్చాయి. ఏ పనిని ప్రారంభించినా సరే..దాంట్లో మొదట ఉండేందుకు ప్రయత్నిస్తాడు. లేటెస్టుగా గౌతమ్ సాధించిన ఓ సక్సెస్ దీనికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో టాప్ ఎనిమిది ఈతగాళ్ల లిస్టులో చోటు సంపాదించాడు గౌతమ్.
ఇంత చిన్న వయస్సులోనే గౌతమ్ ఈ ఘనత సాధించాడు. తన తనయుడు సాధించిన విజయాన్ని సామాజిక మాధ్యమాల వేదికా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది మహేశ్ సతీమణి నమ్రత. గౌతమ్ నీళ్లలో ఐదు కిలో మీటర్ల దూరాన్ని మూడు గంటల్లో ఈదగలడని నమ్రత చెప్పుకొచ్చింది. ఇక తమ అభిమాన హీరో తనయుడు స్విమ్మింగ్ లో రికార్డు సాధించడంతో …మహేశ్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. తండ్రికి తగ్గ తనయుడని కామెంట్స్ పెడుతున్నారు.