అఖండ ట్రైలర్‌కు అఖండ జన ఆదరణ.. 50 మిలియన్లు దాటిన వ్యూస్.. సంతోషంలో బాలయ్య ఫ్యాన్స్!

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అఖండ. తాజాగా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఇటీవలే విడుదలైన అఖండ ట్రైలర్ కు అఖండ ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు 50 మిలియన్ల వ్యూస్ దాటాయి. ఈ విషయాన్ని ద్వారకా క్రియేషన్స్ వెల్లడించింది.
కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది… కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్దంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కేవలం 16 రోజుల్లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం పట్ల బాలకృష్ణ అభిమానులు ఆనందంలో తేలియాడుతున్నారు.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి సినిమా తెరకెక్కుతోంది. తాజా చిత్రం అఖండపై భారీ ఎక్స్‌పెర్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా చేస్తుంది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.