Daggubati Mohan Babu Died: వెంకటేష్ ఇంట విషాదం..దగ్గుబాటి మోహన్ బాబు మృతి

సినీ నటుడు వెంకటేష్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన బాబాయి దగ్గుబాటి మోహన్ బాబు(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రకాశం జిల్లా, కారంచేడులోని స్వగృహంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈయన వెంకటేష్ తండ్రి, లేట్ దగ్గుబాటి రామానాయుడుకు సొంత సోదరుడు. దీంతో విషయం తెలియగానే నిర్మాత సురేష్ బాబు (Suresh Babu), ఆయన రెండో కుమారుడు అభిరామ్ కారంచేడు వెళ్లి నివాళులు అర్పించారు. అయితే, వెంకటేష్ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉండటంతో రాలేకపోయినట్లు సమాచారం. ఆయన రేపు ఉదయం వచ్చే అవకాశం ఉంది.
దగ్గుబాటి ఫ్యామిలీస్‌లో దాదాపు అందరూ సిటీల్లోనే స్థిరపడినప్పటికీ మోహన్ బాబు ఫ్యామిలీ మాత్రమే సొంతూరు కారంచేడులో ఉండిపోయారు. అక్కడ ఆయన వ్యవసాయాన్ని చూసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ఇంటి పెద్ద దిక్కుగా ఉండి అన్ని బాగోగులు చూసుకునే వ్యక్తి మరణంతో దగ్గుబాటి వారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. పైగా రామానాయుడు, మోహన్ బాబు మధ్య మంచి అనుబంధం ఉండేదని, వారిద్దరూ ఒకే మాటపై ఉండేవారని చెప్పుకునేవారు. ఇదిలా ఉంటే, ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.