Sreeja :రెమ్యునరేషన్ తో చిరు చిన్నకూతురుకు కాస్ట్లీ గిఫ్ట్…ఎన్ని కోట్లంటే…!!

Sreeja :రెమ్యునరేషన్ తో చిరు చిన్నకూతురుకు కాస్ట్లీ గిఫ్ట్…ఎన్ని కోట్లంటే…!!

మెగాస్టార్ చిరంజీవి….తన కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా చిరు తన పిల్లలను ఎంతో ప్రేమతో చూసుకుంటారు. లేటెస్టుగా తన చిన్నకూతురు శ్రీజకు చిరంజీవి ఓ ఖరీదైన బహుమతిని అందించారు. తాజాగా ఆ బహుమతికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

శ్రీజ సినిమాల్లో నటించనప్పటికీ…తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ…కొన్నాళ్లకు భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు తల్లిదండ్రులతోనే గడిపిన శ్రీజకు…కళ్యాణ్ దేవ్ తో రెండో వివాహం జరిపించారు. ఇప్పుడు రెండవ పెళ్లి కూడా పెటాకులైనట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. వారిద్దరూ దూరంగా ఉంటున్నారని…విడాకులు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరి పిల్లలకు తల్లి అయిన శ్రీజ…మూడో వివాహానికి రెడీ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇదికూడా చదవండి: పెదనాన్న లేకపోతే ఈ స్థాయికి వచ్చే వాడిని కాదు… ప్రభాస్ ఎమోషనల్…!!!

ఇదిలా ఉండగా…చిరంజీవికి చిన్నకూతురు శ్రీజ అంటే ఎంతో ఇష్టం. శ్రీజ ఏం అడిగినా…చిరు కాదనకుండా వెంటనే దాన్ని చేస్తుంటారు. అయితే ఇప్పుడు తన ముద్దుల కూతురుకు చిరంజీవి ఓ ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కూతురిపై ఉన్న ప్రేమతో చిరంజీవి ఈ ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం అనిల్ సుంకర, మైత్రీ మూవీస్ లతో భోళా శంకర్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్లతో శ్రీజకు ఇంటిని కొనిచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఇంటిని హైదరాబాద్ లోని రోడ్డు నెంబర్ 12లో ఉన్న ఎమ్మెల్యే కాలనీలో కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ఈ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయట. పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని భావించిన చిరంజీవి..ఈ ఇంటిని కొనుగోలు చేశారట. శ్రీజకు బహుమతిగా ఇచ్చిన ఈ ఇంటి విలువ ఏకంగా 35కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇది చిరంజీవికి తక్కువే అయినప్పటికీ విన్న వారికి మాత్రం ఇది పెద్ద విషయమే అని చెప్పవచ్చు. చిరంజీవి కేవలం తన కూతురు శ్రీజకు మాత్రమే కాదు…గతంలో తన చెల్లెళ్లకు కూడా స్థలాలను గిఫ్టుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన తండ్రి ఇచ్చిన బహుమతిని చూసి శ్రీజ మురిసిపోతుందట. ఇంత కాస్ట్లీ బహుమతిని ఇచ్చినందుకు ఆనందభాష్పాలతో తన తండ్రికి థ్యాంక్స్ చెప్పిందట.

శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిద్దరికి ఓ బిడ్డ జన్మించిన తర్వాత…మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారు. ఈ క్రమంలోనే చిరంజీవి తన దగ్గరి బంధువైన కల్యాణ్ దేవ్ కు ఇచ్చి రెండో వివాహం చేశారు. వీరికి ఒక పాప ఉంది. కొన్నాళ్లుగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని సమాచారం. ఈ అనుమానాలకు చెక్ పెడుతూ శ్రీజ తన ఇన్ స్టాగ్రామ్ లో కల్యాణ్ దేవ్ పేరును డిలీట్ చేసింది. శ్రీజ చేసిన ఈ పనితో వీరిద్దరూ విడాకులు తీసుకుంటన్నారన్న అనుమానాలు మొదలయ్యాయి. కల్యాణ్ దేవ్ కూడా సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ…యాక్టివ్ గా ఉంటారు.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d bloggers like this: