Alia Bhatt : ఆ విషయంలో అస్సలు బాధపడటం లేదు…చాలా హ్యాపీగా ఉన్నా…!!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్….RRRమూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అలియా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేనప్పటికీ…కథను మలుపుతిప్పే సీతగా అలియా అందర్నీ ఆకట్టుకుంది. అలియా స్టార్ డమ్ కు ఈ పాత్ర చాలా చిన్నదే. రాజమౌళి అలియాను బాగా నిరాశపరిచాడని… చాలా సన్నివేశాలను కట్ చేయారని…ఫ్యాన్స్ నిరాశ చెందారు. కాగా 2022 ఏప్రిల్ లో రణబీర్ కపూర్ ను అలియా ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ కపుల్ మొత్తానికి ఓ ఇంటి వారయ్యారు. బ్రహ్మస్త్ర మూవీతో వీరిద్దమధ్య ప్రేమ చిగురించి…పెళ్లి పీటల వరకు వెళ్లింది. 7 నెలలకే అలియా ఓ పాపకు జన్మనిచ్చింది.
ఇది కూడా చదవండి: నేడు వైకుంఠ ఏకాదశి..మర్చిపోయి కూడా ఈ తప్పులు చేయకండి..!!
కాగా అలియా తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. జీవితంలో తప్పుఒప్పులు ఉండవని…తనకు మంచి అనిపించి ఇతరులకు చెడుగా అనిపించవచ్చని…కెరీర్ పరంగా కానీ…తన వ్యక్తిగతంగా కానీ తన మనస్సుకు నచ్చిందే చేస్తానని చెప్పుకొచ్చింది. కెరీర్ దూసుకెళ్తున్న సమయంలో రణబీర్ ను వివాహం చేసుకుని ఒక బిడ్డకు తల్లిని అయ్యాను. పెళ్లి చేసుకుని బిడ్డను కనడం వల్ల కెరీర్ ను దెబ్బతీస్తుందని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించింది. ఒక వేళ కెరీర్ ముగిసినా సరే…నా టైం బాగలేదు అనుకుంటాను తప్పా…బాధపడను. అంతేకానీ కెరీర్ కోసం బిడ్డను కన్నందుకు బాధపడను అంటూ చెప్పుకొచ్చింది. తల్లి కావడం కంటే …జీవితంలో ఏదీ గొప్పది కాదు. ఏది జరిగినా…ఎలాంటి మార్పులు వచ్చినా…సహజంగా తీసుకుంటాను కానీ…నేనేమీ బాధపడను. అలియా కెరీర్ ముగిసింది…ఇంకా ఎలాంటి సినిమా ఆఫర్స్ రావంటూ విమర్శించే వారిని తనదైన శైలిలో సమాధానం చెప్పింది అలియా.