Yoga Day 2021: యోగా కోసం ప్రత్యేక యాప్…లాంఛ్ చేసిన ప్రధాని…ఫీచర్స్ ఇవే..!

అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ mYoga పేరుతో యాప్ ను ప్రారంభించారు. యోగా సే సహ్యూగ్ తక్ అనే మంత్రాన్ని ప్రధాని ప్రకటించారు. ఎంయోగా యాప్ లో పూర్తిగా యోాకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఈ యాప్ ను వరల్డ్ వైడ్ గా అందుబాటులో ఉంది. ప్రపంచంలోని నలుమూలలకు యోగాను తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ యాప్ ను ఉపయోగించబడుతుందని ప్రధాని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాకారంతో భారత్ లో మరో ముఖ్యమైన అడుగు వేసిందని…ఎంయోగా యాప్ దాదాపుగా ప్రపంచంలోని అన్నిభాషల్లో ఉయోగించవచ్చని తెలిపారు. ప్రాచీన శాస్త్రం, మోడర్న్, టెక్నాలజీల కలయికే ఈ ఎంయోగా యాప్ అని కొనియాడారు. నిజానికి ఈ యాప్ ను గతంలోనూ డిజైన్ చేసినా…కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రారంభించే కార్యక్రమం వాయిదా పడింది.
శాస్త్రీయ సాహిత్యాన్ని సమీక్షించి…అంతర్జాతీయ నిపుణులతో సంప్రదించిన తర్వాతే ఈ యాప్ ను రూపొందించినట్లుగా who తెలిపింది. డబ్లూహెచ్ఓ, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కలిసి ఈ యాప్ ను డిజైన్ చేశాయి. ఎంయోగా యాప్ ను 12 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఎవరైనా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎక్కడైనా ఈ యాప్ సాయంతో యోగాసానాలు చేసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ లాంగ్వేజేస్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలోనే ఐక్యరాజ్యసమితి గుర్తించిన భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఇక ఈ యాప్ లో యోగా నేర్చుకోవడానికి కావాల్సిన వీడియోలు చాలా ఉంటాయి. వీడియోలు చూస్తూ ఆసనాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పది, ఇరవై, 45 నిమిషాలు ఇలా మీకు కావాల్సినంత సమయం యోగా చేసుకోవాలంటే అంత సమయాన్ని సెలక్ట్ చేసుకోవాలి. అందుకు తగ్గట్లుగా వీడియోలు ఉంటాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ ఎంయోగా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.