Tide: అంతరిక్షంలోకి ” టైడ్ “

బట్టలు ఉతికేందుకు ఏం పౌడర్ వాడుతారు. రిన్ సర్ఫ్, ఎరియల్ సర్ఫ్, టైడ్ సర్ఫ్ వీటిని ఎక్కువగా వాడుతుంటారు. నిజానికి రిన్, ఎరియల్, టైల్ ఎలా అయితే రకరకాల బ్రాండ్లో సర్ఫ్ ఒక బ్రాండ్. మొదటితరం డిజర్టెంట్ పౌడర్ గా సర్ఫ్ రావటం…జనాల్లో డిజర్టెంట్ పౌడర్ ను సర్ఫ్ అని పిలవటం అలవాటైంది. ఏ బ్రాండ్ అయినా సరే…దాని పక్కన సర్ఫ్ అనే మాటతో పిలవడం కామన్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే…బ్లండర్ మిస్టేక్ పద ప్రయోగం లాంటిది.
బ్లండర్, మిస్టేక్…రెండూ ఒకటే అర్ధం. కానీ తీవ్రతలో కొంచెం తేడా ఉంటుంది. అంతేకానీ బ్లండర్ మిస్టేక్ అనేది ఉండదు. చాలామంది చదువుకున్నవారు కూడా ఈ పదాన్ని నిత్యం వాడేస్తుంటారు. అలాగే సర్ఫ్ కూడా. ఇదంతా ఎందుకంటే…ఒక డిటర్జెంట్ పౌడర్ మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్లనుంది. నాసా దీని స్పెషల్ గా పంపిస్తోంది. ఇంతకీ ఇదేం బ్రాండ్ అంటారా…ఆశ్చర్యపోయారా అంటు తెలుగు లోగిళ్లకు సుపరిచితమైన టైడ్ త్వరలోనే అంతరిక్షంలోకి వెళ్లనుంది. అంతరిక్షంోలని వ్యోమగాముల బట్టల మురికిని వదిలించుకోవడానికి…ఎప్పటికప్పుడు కొత్త బట్టలను వినియోగించడం తప్పించి…అక్కడ ఉతకడం లాంటిదేమీ ఉండదు.
అయితే రానురాను వారికి బట్టలు పంపడం కష్టంగా మారుతోంది. దీంతో వారి బట్టలను అక్కడే ఉతుక్కునేందుకు వీలుగా…సరికొత టెక్నాలజీని ప్రొక్టర్ అండ్ గాంబుల్ సంస్థ రెడీచేసింది. టైడ్ బ్రాండ్ మీద వారికి అవసరమైన డిటర్టెంజ్ మాడ్యూల్ ను పంపించనున్నారు. ఈ సంస్థకు చెందిన సైంటిస్టులు నాసా పరిశోధకులతో కలిసి రూపొందించిన డిటర్జెంట్ ను అతరిక్షంలోకి పంపుతున్నారు. అలా మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్లే డిటర్జంట్ బ్రాండ్ గా టైడ్ నిలవనుంది.