World Bank: భారత్ కు అండగా ప్రపంచ బ్యాంకు..ఎందుకంటే!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ కు ప్రపంచ బ్యాంకు వెన్నుగా నిలిచింది. భారత్ లోని ఎమ్ఎస్ఎమ్ఈ రంగానికి భారీగా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు 3640కోట్ల ఆర్థిక సాయం అందజేసేందుకు ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా కోవిడ్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న భారతీయ ఎమ్ఎస్ఎమ్ఈ రంగాన్ని పటిష్టపరిచేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయాలని తెలిపింది. భారత్ కు నిధులు రిలీజ్ చేయాలన్న ప్రతిపాదనకు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైర్టకర్ల బోర్డుకు కూడా అనుమితించింది. 2020 ప్రారంభంలో భారత్ లో కోవిడ్ మహమ్మారి ప్రభావంతో చాలా రంగాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ప్రజల ఆరోగ్యం, చిన్న మధ్య తరహా వ్యాపారాల రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసింది.
అయితే దీనితో దేశంలో మొత్తం 5.55 లక్షల వ్యాపార సంస్థలు భారత ప్రభుత్వం సాయాన్ని కోరుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎమ్ఎస్ఎమ్ఈ రంగాల పునురుద్దరణకు ప్రపంచబ్యాంకు నిధులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయనుకుంటుంది. ఎమ్ఎస్ఎమ్ఈ రంగానికి భారతీయ ఆర్థిక వ్యవస్థ వెన్నుముక వంటింది. కరోనా కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం నుంచి 30శాతం gdp 40శాతం దిగుమతులపైన్నే నడుస్తోంది. వరల్డ్ బ్యాంక్ అందించే ఈ ప్రోగ్రామ్ కింద 5వందల మిలియన్ డాలర్లు ఎమ్ఎస్ఎమ్ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రొగ్రామ్ కింద 750మిలియన్ డాలర్లను 2020లోనే అందించనున్నట్లు ప్రకటించగా…ఈ ప్రొగ్రామ్ కింద ఇప్పటివరకు 5 మిలియన్లు ప్రభుత్వ సంస్థలకు ఆర్థికంగా లబ్ది చేకూరింది.